ప్రియుడితో ఎంజాయ్ చేయనివ్వటం లేదని రెండేళ్ల కొడుకును నేలకు కొట్టి చంపిన తల్లి

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో ఓ యువతి తన రెండేళ్ల కుమారుడిని ప్రియుడితో గడిపే సమయంలో ఏడ్చాడన్న కారణంతో కొట్టి చంపిన సంఘటన ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ దారుణం గత నెలలో జరిగినప్పటికీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

పెళ్ళయి భర్త ఉన్నా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌కు చెందిన జ్యోతి-స్వామి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి కీసరలో స్థిరపడ్డారు. స్వామి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, జ్యోతి ఇంటి పనులు చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఉండేది. వారికి నాలుగేళ్ల కుమార్తె మరియు రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే, జ్యోతికి పెళ్లికి ముందు నుంచి యాదాద్రి జిల్లా మాదాపూర్‌కు చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది.

ప్రియుడితో ఉన్నప్పుడు ఏడ్చిన రెండేళ్ళ బాబు.. నేలకేసి కొట్టిన తల్లి

వివాహం తర్వాత కూడా ఈ సంబంధం కొనసాగుతూనే ఉంది. మే 29న స్వామి డ్యూటీకి వెళ్లిన సమయంలో నవీన్ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా చిన్నారి ఏడవడంతో వారి సరదాకు అడ్డు వచ్చాడని ప్రియుడు చిరాకు పడ్డాడు. ఏడుపు బయటకు వినిపిస్తే సమస్యలు ఎదురవుతాయని చెప్పి, పిల్లాడిని చంపేయాలని సూచించాడు. కామాంధురాలైన జ్యోతి తన కుమారుడిని నేలకేసి కొట్టి హత్య చేసింది.

ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించినా చివరకు దొరికిందిలా

ఘటన తర్వాత జ్యోతి భర్తకు బాబు ఫిట్స్ వచ్చి చనిపోయాడు అని అబద్ధం చెప్పి నమ్మించింది. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అయితే, ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన స్వామి అనుమానించి నిలదీయడంతో నిజం బయటపడింది. కుటుంబ సభ్యుల ముందు పంచాయితీలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. భర్త స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జ్యోతిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మామిడి రైతులకు శుభవార్త.. అత్యాధునిక ఇరేడియేషన్ కేంద్రంతో మీ సమస్యకు చెక్!
మామిడి రైతులకు శుభవార్త.. అత్యాధునిక ఇరేడియేషన్ కేంద్రంతో మీ సమస్యకు చెక్!

తల్లుల్లో పెరుగుతున్న క్రూరత్వం

ఈ ఘటన సమాజంలో తల్లుల్లో పెరుగుతున్న క్రూరత్వాన్ని సమాజం చర్చించుకునేలా చేసింది. కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పులు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై సమాజం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేగు బంధాన్ని మరచిపోతున్న తల్లుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Mother killed son by smashing him against the floor because he was preventing her from enjoying with lover
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+