అది మాకందరికీ అవమానం: కేసీఆర్‌పై మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటిమంది మాల మాదిగలు ఉండగా కనీసం ఒక్కరికైనా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం ఇవ్వని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళిత వ్యతిరేక దృక్పథానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నట్లు టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం చెప్పారు.
తొలి అడుగుగా ఈ నెల 28న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దళితుల ఓఠ్ల కోసం వారికి సీఎం పదవిని ఇస్తానని కేసీఆర్ ప్రకటించి, గెలిచాక తుంగలో తొక్కి, అతనే పీఠంపై కూర్చున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలను మభ్యపెట్టేందుకు దళితుడైన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, కొద్ది రోజులకే అవమానకరంగా అతనిని బర్తరఫ్ చేశారని మండిపడ్డారు. అది దళితుల పట్ల కేసీఆర్ నైజమన్నారు. రాజయ్యకు జరిగిన అవమానం వ్యక్తిగతమైంది కాదని, అది దళితులందరికీ జరిగిందన్నారు.
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడమే కాకుండా, దళితులే ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించేలా చేస్తామని హెచ్చరించారు. మంత్రివర్గంలో మఙిలలు, దళితులకు ప్రాతనిథ్యం లేదన్నారు. బీసీ మంత్రులు ఉన్నప్పటికీ నోరే లేదని ఎద్దేవా చేశారు. వారు ఉత్సవ విగ్రహాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications