నేరేళ్ళలో దళితులకు మత్తు మందిచ్చి కొట్టారు: మోత్కుపల్లి

హైదరాబాద్: నేరేళ్ళలో దళితులను కులం పేరుతో దూషిస్తూ కొట్టారని, మత్తుమందిచ్చి మరీ కొట్టారని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు మోత్కుపల్లి.

నేరేళ్ళ ఘటనపై మోత్కుపల్లి నర్సింహ్ములు తీవ్రంగా చలించిపోయారు. కెసిఆర్ చరిత్రలో ఈ ఘటన మాయనిమచ్చ అవుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేశారని చెప్పారు. ఎస్ఐ రవీందర్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Mothkupally Narsimhulu demand to lift suspension on Si Ravinder

ఇసుకదోపిడి చేస్తోంటే మైనింగ్ మాఫియా అనకుండా ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. మైనింగ్ మంత్రిగా కెటిఆర్‌కు బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో వ్యాపారానికి అడ్డు తగులుతున్నారనే నెపంతోనే నేరేళ్ళలో దళితులను చితకబాదారని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఆరోపించారు.

కరీంనగర్ జైలు సూపరింటెండ్, బిజెపి నేతలు ఆదుకోకపోతే తాము బతికే వారేమే కాదని బాధితులు మంత్రికి చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇసుక లారీలతో ఎంతమంది చనిపోయారో తెలుసా అంటే మంత్రి సమాధానం చెప్పలేదని బాధితులు చెప్పారన్నారు మోత్కుపల్లి.ఇసుక లారీలను అడ్డుకొంటున్నందుకే కక్షకట్టి రాజకీయ కుట్రకు బలిచేశారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+