ముంబై టైలర్: హైదరాబాద్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, రేప్ చేశాడు

హైదరాబాద్: ముంబై నుంచి హైదరాబాదు నగరంలోని బంధువుల ఇంటికి వచ్చిన ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించాడు. ఈ ఘటన హైదరాబాదు పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతను అమ్మాయిపై పలు మార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ముంబైలో టైలర్‌గా పనిచేసే మోసిన్ పర్వీజ్ ఖజీ (24) పాతబస్తీలోని పహడి షా దర్గా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూతురు (17)తో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆ అమ్మాయితో ఫోన్ సంభాషిస్తూ ప్రేమిస్తున్నట్లు నటించేవాడు. నగరానికి వచ్చిన ప్రతిసారి యువతిని బంధువుల ఇళ్లకు తీసుకెళ్లేవాడు.

గతంలో ఓసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 6వ తేదీ సాయంత్రం దుకాణం వెళ్తున్నానని తెలిపిన బాధితురాలు తిరిగి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అమ్మాయి తండ్రి తన కూతురు సెల్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

Mumbai tailor held for rape by Hyderabad Police

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితురాలి సెల్‌ఫోన్‌ను సిగ్నల్‌ను ట్రేస్ చేసి నిందితుడితో పాటు ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు ముంబయి బయలుదేరి వాసీ బస్‌స్టాండ్ సమీపంలో అమ్మాయి ఆచూకీ తెలుసుకున్నారు. పోలీసులను గుర్తించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

బాధితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై నుంచి గోవాకు వెళ్లడానికి వాసీ బస్‌స్టాండ్‌కు తీసుకొచ్చాడని ఆమె తెలిపింది. ముంబై తీసుకెళ్లిన అనంతరం ఆమె లైంగికదాడికి గురైనట్లు ఏసీపీ అశోక్‌చక్రవర్తి తెలిపారు.

ముంబైలో పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు పని మీద హైదరాబాద్ వచ్చాడు. దీంతో వారు అతన్ని పట్టుకున్నారు. కిడ్నాప్‌తో పాటు నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ అరెస్టు చేశామని అశోక్ చక్రవర్తి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+