వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటల కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణుల రాళ్లదాడి; పలువురికి గాయాలు.. మునుగోడులో ఉద్రిక్త పరిస్థితి!!

|
Google Oneindia TeluguNews

మునుగోడులో చివరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈటల రాజేందర్ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడి చేయడంతో మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో ఈటల రాజేందర్ వ్యక్తిగత సిబ్బంది, బిజెపి నేతలు గాయాల పాలయ్యారు. ఈటల రాజేందర్ గన్ మెన్ ఈ ఘటనలో గాయపడ్డారు.

ఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణుల దాడి

ఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణుల దాడి


మునుగోడు ఉప ఎన్నికల పోరు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో రాజకీయ పార్టీలన్నీ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. ఇక ఈ రోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు కీలక నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఈ రోజు పలివెల లో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న ప్రచారం వద్ద ఒక్కసారిగా టిఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు.

రాళ్ళు, కర్రలతో దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలు

రాళ్ళు, కర్రలతో దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలు

ఈటల రాజేందర్ ప్రచార రథాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. రాళ్ల తో, కర్రలతో ఒక్కసారిగా దాడికి దిగడంతో ఈటల రాజేందర్ వాహనం ధ్వంసమైంది. కాన్వాయ్ లోని పలు వాహనాలు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ప్రచారం నిర్వహించకుండానే ఈటల రాజేందర్ అక్కడ నుండి వెనుదిరిగారు. మొదటి నుండి అక్కడ ఆందోళనలకు అవకాశం ఉందని తెలిసినప్పటికీ పోలీసులు అక్కడ పరిస్థితిని కంట్రోల్ చెయ్యటంలో విఫలం అయ్యారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడి.. బీజేపీ ఆరోపణ

పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడి.. బీజేపీ ఆరోపణ


అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూశారని, పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రోద్బలంతో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడులు జరిగాయని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఓటమి భయంతో దుర్మార్గానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు తెర తీశారని నిప్పులు చెరుగుతున్నారు. గాయపడ్డ వారిలో ఈటల రాజేందర్ వ్యక్తిగత సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా పలివెల ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పోలీసుల తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు

పోలీసుల తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు


ఇక ఈ ఘటనపై టిఆర్ఎస్ పార్టీ తీరుపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. దాడికి పాల్పడిన టి.ఆర్.ఎస్ నాయకులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు, నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండడాన్ని వారు తప్పు పడుతున్నారు. పోలీసులు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సహకరించారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కూడా చేసుకోకుండా అడ్డుకోవటం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తున్నారు.

వారు నిప్పు కణికలా? కేసీఆర్ డ్రామాలు మునుగోడు ప్రజలు నమ్మరు: ఈటల రాజేందర్వారు నిప్పు కణికలా? కేసీఆర్ డ్రామాలు మునుగోడు ప్రజలు నమ్మరు: ఈటల రాజేందర్

English summary
In munugode by-election campaign, TRS ranks pelted stones on the convoy of etela rajender in Palivela and few people were injured. This created a tense situation there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X