మునుగోడు ఉపపోరు: కాంట్రాక్ట్ పే అంటూ.. రాజగోపాల్ రెడ్డిపై వెలసిన షాకింగ్ పోస్టర్లు!!
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతున్నారు. ఇక మునుగోడులో బలంగా ప్రచారం నిర్వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తనకు కేంద్రం ఇచ్చిన 18 వేల కోట్లు కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారు అని పదేపదే టార్గెట్ చేస్తున్నారు.

చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంట్రాక్ట్ పే పోస్టర్లు
ఇక తాజాగా మునుగోడు నియోజకవర్గం లోని చండూరు లో రాజగోపాల్ రెడ్డి పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం గా మారాయి. చండూరులో రాత్రికి రాత్రి ఫోన్ పే తరహాలో, కాంట్రాక్ట్ పే అంటూ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. కాంట్రాక్ట్ పే ద్వారా 18 వేల కోట్ల ట్రాన్సాక్షన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ చండూరు మండలం లోని అన్ని చోట్ల వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోటో తో పాటు బిజెపి 18 వేల కోట్లు ట్రాన్సాక్షన్ ఐడి అని పేర్కొన్నారు. అంతేకాదు 18 వేల కోట్ల కాంట్రాక్టు లతోపాటు 500 కోట్ల బోనస్ రివార్డును కూడా గెలుచుకున్నారు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.

గతంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైపైనా పే సీఎం పోస్టర్లు
గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ని టార్గెట్ గా చేసుకొని పే సిఎం అంటూ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపణలు చేస్తూ 40 శాతం కమీషన్ సర్కార్ పేరుతో కాంగ్రెస్ పార్టీపై సీఎం పోస్టర్లను ప్రచురించింది. ఇక ఈ పోస్టర్లలో బసవరాజు బొమ్మై ఫోటో క్యూ ఆర్ కోడ్ తో ఉన్న పోస్టర్లు పెద్ద ఎత్తున కర్ణాటకలో దర్శనమిచ్చాయి. ఇప్పుడు కర్ణాటక తరహాలోనే చండూరు లో కూడా కాంట్రాక్ట్ పే అంటూ పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశమైంది.

కాంట్రాక్ట్ పే పోస్టర్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారో?
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని, ఇది క్విడ్ ప్రో కో కాక మరి ఏంటని రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేశారు. దీనికి సమాధానం చెప్పిన రాజగోపాల్ రెడ్డి తనపై కేటీఆర్ చేస్తున్న క్విడ్ ప్రో కో ఆరోపణలను 24 గంటల లోగా నిరూపించాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ చేసిన పోస్టుకు ఘాటుగా బదులిచ్చారు. మరి ఇక ప్రస్తుతం కాంట్రాక్ట్ పే పోస్టర్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అన్నది, అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఏ విధంగా సమాధానం చెబుతారు అన్నది తెలియాల్సి ఉంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications