మునుగోడు వార్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళే!!
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే బిజెపి రాష్ట్ర నేతలు, జాతీయ నేతలతో రెండు దశల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇక టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించి ప్రచారం సాగిస్తోంది. మునుగోడులో ప్రచార పర్వంలో దూకుడు పెంచడానికి కాంగ్రెస్ పార్టీ 38 మంది నేతల పేర్లతో స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ప్రకటించింది.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికిస్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు నవంబర్ 3వ తేదీన మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో మాణిక్కం ఠాగూర్, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంత రావు, చల్లా వంశీ చంద్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మధుయాష్కిగౌడ్, దామోదర రాజనర్సింహ ఉన్నారు.

రంగంలోకి దిగనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు
అంతేకాక దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టి.జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి, పోరిక బలరాం నాయక్, కొండా సురేఖ, సీతక్క, గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, శంకర్ నాయక్, ప్రేమ్ సాగర్ రావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి , చెరుకు సుధాకర్, జీ విజయరామారావు, గండ్ర సత్యనారాయణ, చిక్కుడు వంశీకృష్ణ, రాములు నాయక్, జయప్రకాష్ రాపోలు, పున్నా కైలాష్ నేత, చల్ల మల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు.

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు .. సర్వత్రా ఆసక్తి
ఇక ఈ జాబితాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఉండడం ఆసక్తికరం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించవలసిన సభ్యుల కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా ఉండటంతో ఆయన ప్రచారం నిర్వహిస్తారా లేదా అన్నది ప్రస్తుత ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనుంది.












Click it and Unblock the Notifications