మునుగోడు టీఆర్ఎస్ లో మొదలైన పంచాయితీ.. కూసుకుంట్లపై వ్యతిరేకత .. టికెట్ ఇవ్వొద్దు అంటూ..
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇక టిఆర్ఎస్ పార్టీలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో పోటీ చేయడానికి పార్టీ టిక్కెట్ కోసం రేసు ప్రారంభమైంది. నువ్వా నేనా అంటూ టీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం తలపడుతున్నారు. ముఖ్యంగా ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశతో చాలా మంది టీఆర్‌ఎస్ నేతలు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో యాక్టివ్‌గా మారి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. చకచకా పావులు కదుపుతున్నారు.

టీఆర్ఎస్ మునుగోడు టికెట్ కోసం ఆశావహుల ప్రయత్నాలు
మరికొందరు పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు ను కలిసి తమకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అప్పటి నుండి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమయ్యేందుకు టీఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించడంతో నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితర నేతలు నియోజకవర్గ టికెట్ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.

మునుగోడు బరిలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఆశావహులు వీరే
నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సీటు కోసం ఆశపడుతుండగా, కర్నె ప్రభాకర్ కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న ముఖ్యనేతల్లో ఒకరైన ప్రభాకర్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మునుగోడులో ఉపఎన్నిక వస్తే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాజీ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎంపీగా నియోజక వర్గానికి సేవలందించినందున తనకు అవకాశం ఇవ్వాలని నర్సయ్యగౌడ్ కోరినట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ జి సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వొద్దు అంటున్న టీఆర్ఎస్ నేతలు
ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా పరిశీలన చేయొద్దంటూ నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఇక పార్టీలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం సొంత పార్టీ ప్రజా ప్రతినిధుల ఆర్థిక మూలాలను దెబ్బతీశారని, తన మాట వినని వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయించారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఆయనకు టికెట్ ఇస్తే బీజేపీలో లేదా కాంగ్రెస్ లో చేరతామంటున్న గులాబీ నేతలు
ఇక నియోజకవర్గంలో వార్డు సభ్యుల నుంచి జడ్పిటిసి వరకు ఉన్న నేతల మధ్య విభేదాలు సృష్టించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆనందపడే వారిని, అటువంటి వ్యక్తికి మునుగోడు అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వొద్దని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇక ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని వారు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ తమ ఆవేదన పట్టించుకోవాలని, కూసుకుంట్లకు అవకాశం ఇస్తే పార్టీ నాశనం అయిపోతుందని వారు తెలిపారు. దీంతో కేటీఆర్ నాలుగు రోజులుగా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను పిలుచుకొని పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications