Nagarjunasagar: సాగర్ గేట్లు ఎత్తివేత.. పెరిగిన పర్యాటకుల తాకిడి..

పై నుంచి వరద పెరగడంతో నాగార్జునసాగర్ నీటి సామర్థ్యం గరిష్ఠస్థాయికి చేరుకుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలుతున్నారు. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. అధికారులు ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 2 లక్షల 2 వేల క్యూసెక్కుల నీటిని కింది విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ కూడి కాలువకు 6 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 6 వేల క్యూసెక్కుల నీరును వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 28 వేల క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2 వేలక క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇటు వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ సంవత్సరం కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. జూరాల, శ్రీశైలం, పులిచింతల నెల క్రితమే నిండిపోయాయి. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటి సామర్థ్యం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884 అడుగుల వరకు నీరు ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఆదివారం నాగార్జునసాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చారు.

Nagarjunasagar lifted 20 crust gates and let the water down

పారుతున్న నీటిని చూస్తూ ఎంజాయ్ చేశారు. బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్‌‌‌‌, పవర్‌‌‌‌హౌస్‌‌‌‌, అనుపు, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన గేట్లు, కొత్త బ్రిడ్జి వద్ద పర్యాటకుల రద్ది కనిపించింది. పర్యాటకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్‌‌‌‌ జామ్ అయింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ బస్సులు నడుపుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టు‌ గేట్ కూడా ఎత్తారు. జూరాల ప్రాజెక్టుకు వరద పరవళ్లు తొక్కుతుండటంతో 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.949 టీఎంసీల నిల్వ ఉన్నది. కరీంనగర్‌ జిల్లాలోని లోయర్‌ మానేర్‌ డ్యామ్‌కు వరద పెరగడంతో ఆదివారం ఉదయం అధికారులు రెండు గేట్లు ఎత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+