ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదివాసీల అతిపెద్ద జాతర నాగోబా జాతర; హాజరుకానున్న కేంద్రమంత్రి; విశేషాలివే!!

|
Google Oneindia TeluguNews

ఆదివాసీలు అత్యంత ఘనంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర మొదలవుతుంది. ఈ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేడు ప్రారంభం కానున్న నాగోబా జాతర

నేడు ప్రారంభం కానున్న నాగోబా జాతర


ఇక నాగోబా జాతర ప్రత్యేకత విషయానికి వస్తే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరలో శనివారం సాయంత్రం ఎడ్ల బండ్లతో గోవాడ్ కు చేరుకుంటారు. ఆపై నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి , ఆపై ప్రత్యేక పూజలు చేసి ఏడు రకాల పాము పుట్టలను తయారుచేసి వాటికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటుగా, ఆదివాసీలు విశ్వసిస్తారు.

నాగోబా జాతర చరిత్ర ఇదే

నాగోబా జాతర చరిత్ర ఇదే


ఇక నాగోబా జాతర నిర్వహణకు సంబంధించిన చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం 740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేష సాయి నాగలోకానికి వెళ్తాడు. అక్కడ నాగరాజు లేకపోవడంతో నిరుత్సాహంతో శేష తల్పం తాకి కేస్లాపూర్ కు వెనుదిరుగుతాడు. ఇక శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగేంద్రుడు ఆగ్రహంతో శేష సాయిని అంతమొందించటానికి భూలోకానికి వస్తాడు. ఈ విషయం తెలిసిన శేష సాయి ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు, తదితర ఏడు రకాల నైవేద్యంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోదావరి, హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేస్తాడు. ఇక దీంతో సంతృప్తి చెందిన నాగరాజు కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి వెళ్లి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని అప్పటినుంచి పూజలు అందుకుంటూ ఉంటాడు.

నాగోబా జాతరలో దర్బార్ ది ప్రత్యేకమైన స్థానం

నాగోబా జాతరలో దర్బార్ ది ప్రత్యేకమైన స్థానం

ఇక అప్పుడు మొదలైన నాగోబా జాతర అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. ఇక నాగోబా జాతరలో నిర్వహించే ప్రజా దర్బార్ కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. నాగోబా జాతరలో దర్బార్ ను 77 ఏళ్ల క్రితం నుండి నిర్వహిస్తున్నారు. ఇక ఈ దర్బార్లో నేటికీ గిరిజనుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఎన్నో విశేషాలు ఉన్న గిరిసీమలో కేస్లాపూర్ నాగోబా జాతర సందడి మొదలైంది. తమ ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు ఆదివాసీలు సిద్దమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిదిలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన నాగోబా ఆలయంలో ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మేస్రం వంశీయుల గోదావరి నది జలాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ప్రారంబించడం ఆనవాయితీ.

నేడు రాత్రి 10 గంటలకు మెస్రం వంశస్తుల మహాపూజతో నాగోబా జాతర మొదలు

నేడు రాత్రి 10 గంటలకు మెస్రం వంశస్తుల మహాపూజతో నాగోబా జాతర మొదలు


మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలాన్ని మట్టికుండలలో మెస్రం వంశ మహిళలు అందిస్తారు. గిరిజన సాంప్రదాయ డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో పూజాసామాగ్రిని గంగాజలంతో పాటు శోభాయాత్ర నిర్వహించి నాగోబా అలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏడు పుట్టల వద్ద నవ ధాన్యాలు, ఆవు పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర నేడు రాత్రి 10 గంటలకు నాగోబా కు మహాపూజతో ప్రారంభంకానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు.

నాగోబా జాతరకు హాజరు కానున్న కేంద్ర మంత్రి..

నాగోబా జాతరకు హాజరు కానున్న కేంద్ర మంత్రి..

ఈ జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. నాగోబాను దర్శించుకోవడానికి ఈనెల 22న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి కఅన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసి నిర్మల్, ఉట్నూర్, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ డిపోల నుంచి నేటి నుంచి 28వరకు ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ఆర్ ఎం జానీరెడ్డి తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం వైద్య ఆరోగ్య శాఖప్రత్యక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది . వివిధ శాఖల అధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది.

English summary
Nagoba Jatara, the biggest fair of tribals, will start from today night 10pm. Union Minister Arjun Munda will attend this fair. There are many things related to the Nagoba jatara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X