చంద్రబాబు వ్యూహం: తెలంగాణలో నారా లోకేష్ టూర్
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పార్టీని కాపాడేందుకు తన తనయుడు నారాలోకేష్‌ను రంగంలోకి దింపారు. సంక్రాంతి పండుగ తరువాత తెలంగాణ పది జిల్లాల్లో పర్యటన చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలోనే తెలంగాణ టిడిపి నేతలు లోకేష్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. నియోజక వర్గా ల్లోను పర్యటనలు చేయించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతోపాటు నష్టపోయిన కార్యకర్తలను ఆదుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తర్వలోనే పర్య టనకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారంగా విడు దల చేయనున్నట్లు ఓ టిడిపి నేత చెప్పారు. అయితే, లోకేష్ తెలంగాణలో కార్యకర్తల సదస్సులకే పరిమితమవుతారని చెబుతున్నారు.
తెలంగాణ రాష్టంలో తెలుగుదేశంపార్టీకి గ్రామ స్ధాయి నుంచి బలమైన క్యాడర్ ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సీమాంధ్రపాంతంలో టిడిపిని కాపాడుకునేందుకు చంద్రబాబు కొంత వెనకడుగు వేయడంతోపాటు రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంభించడంతో తెలంగాణలో పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి వలస వెళ్లారు.. నేతలు వెళ్లినప్పటికీ క్యాడర్ మాత్రం సైకిల్‌పార్టీని వీడలేదని చంద్రబాబు భావిస్తున్నారు.

గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఒక్క ఎంపి,15 అసెంబ్లీ సీట్లును సాధించి టిడిపి పార్టీ టిఆర్‌ఎస్‌ను తట్టుకుని నిలబడింది. అయితే తెలంగా ణలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్ కంటే టిడిపికే బలం ఎక్కువగా ఉండటంతో టిఆర్‌ఎస్ ఆపార్టీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష వలవిసిరింది. ముగ్గురు శాసనసభ్యులు పార్టీని వీడిపోయారు. మిగిలిన నేతలను సైతం కారు ఎక్కించుకునేందుకు ప్రయత్నిం చినప్పటికీ వారు పార్టీని వీడటానికి ఇష్టపడలేదు.
ఇటీవల తెలుగుదేశంపార్టీ సంస్ధాగత ఎన్నికలను వెళ్లే ముందు ఆనవాయితీగా నిర్వహించే సభ్యత్య నమోదులోను 10 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసింది. నేతలు వెళ్లిపోయిన ద్వితీ యశ్రేణి నేతలు,కార్యకర్తలు పార్టీకి అండగా నిలవడంతో సభ్యత్య నమోదులోను ఆశించినస్ధాయిని దాటిందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 2019 నాటికి తెలంగాణలో తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలకు ఉపక్రమించింది. గ్రామస్ధాయి నుంచి సుశిక్షుతులైన క్యాడర్‌తో పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది.
క్యాడర్‌ను ఉత్సాహా పరిచేందుకు ఆయా నియోజక వర్గాల్లో యువనేత నారా లోకేష్ పర్యటనలను ఏర్పాటు చేసింది. సంక్రాంతి తరువాత తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాలో లోకేష్ పర్యటిస్తారు. ఈపర్యటనలో క్యాడర్‌ను ఉత్సాహా పరిచేందుకు ప్రభుత్వ వ్యతిరే కార్యక్రమాల్లోను లోకేష్ పాల్గొని నిరసన తెలిపే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications