ఉండూ అంటూ తెలంగాణ కార్మికుడితో మోడీ సరదా మాట
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) చేరుకున్నప్రధాని నరేంద్ర మోడీ ఆబుధాబి శివారులోని కార్మిక నివాసాన్ని సందర్శించారు. అందరితో కలియ తిరుగుతూ కార్మికుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్యాంపులోని భారతీయ కార్మికులను ప్రత్యేకంగా ఇండోర్ స్టేడియంలో ఆయన కులుసుకున్నారు. హిందీతో పాటు అనువాదకుల సహాయంతో మలయాళం, తెలుగు, తమిళ భాషలు మాట్లాడే కార్మికులతో నవ్వుతూ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కథ్లపూర్ మండలం భూషణ్‌రావు పేట గ్రామానికి చెందిన ముస్కు రాము అనే ప్రవాసీ యువకుని భుజంపై చేయి వేసి ప్రధాని అనేక కుశల ప్రశ్నలు అడిగారు.
ఆ తర్వాత మరో కార్మికునితో మాట్లాడుతుండగా, తెలంగాణ కార్మికుడు ప్రధానితో మాట్లాడబోయాడు. దీంతో, ‘తెలంగాణా.. ఉండూ.. ఉండూ...' అని ప్రధాని స్పందించారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం చాన్సలర్ జఫర్ సరేష్వాలా ప్రధాని మోడీ వెంట ఉన్నారు. యుఎఇ అంటే మినీ భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదం మానవాళికే పెను సవాల్‌గా మారిందని ఆయన హెచ్చరించారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న అరబ్ ఆర్థిక రంగంతో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని తాము ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా భద్రత, ఇంధనం, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకుంటామని ఆయన అన్నారు.
మోడీకి అబుదాబిలో ఘన స్వాగతం లభించింది. ఆదివారంనాడు సంప్రదాయాన్ని పక్కన పెట్టి యువరాజు, సైనిక దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షెక్ మహ్మద్ బిన్ జాయెద్ ాల్ నహైన్ విమానాశ్రయంలో ఆయన స్వాగతం పలికారు. యువరాజుతో పాటు ఐదుగురు సోదరులు మోడీకి స్వాగతం పలకడానికి వచ్చారు.












Click it and Unblock the Notifications