మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29గా నవదీప్; హీరో నవదీప్ కు నోటీసులు!!
డ్రగ్స్ కేసులు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. చాప క్రింద నీరులా టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసుతో స్పష్టమైంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఫిల్మ్ ఫైనాన్షియర్ కే వెంకటరమణారెడ్డితో పాటు డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఈ కేసులో హీరో నవదీప్ కు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.మాదాపూర్ లోని విఠల్ నగర్ లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ కేసులో హీరో నవదీప్ డ్రగ్స్ వినియోగదారుడు గా ఉన్నాడని, ప్రస్తుతము అతను పరారీలో ఉన్నాడని వెల్లడించారు.

అయితే డ్రగ్స్ కేసుపై తాజాగా స్పందించిన హీరో నవదీప్ మాత్రం నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్మీట్లో నవదీప్ అన్నాడని, హీరో నవదీప్ అని చెప్పలేదని, తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడని పోలీసులు నిన్న వెల్లడించారు.
పోలీసులు నటుడు నవదీప్ కు డ్రగ్స్ ముఠా తో సంబంధం ఉందని, అతన్ని ఈ కేసులో ఏ 29 గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు నైజీరియన్ లతో సహా ఎనిమిది మంది నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు, ఈ కేసులో షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు , మోడల్ శ్వేత తదితరులు పరారీలో ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టారు.
ఈ కేసులో డీలర్ బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో సినీ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో తాజాగా మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగటంతో సిటీలోని పబ్బులపై పోలీసులు నిఘా పెట్టారు.












Click it and Unblock the Notifications