Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"సానుభూతి సరిపోదు".. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పవనాలు!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దించింది. అయితే ఈ ఉపఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశాలపై తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణిగా ఆమెకు సానుభూతి దక్కినా.. ఈ సారి ఎన్నికల వాతావరణం, బీఆర్ఎస్‍పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ దూకుడు కారణంగా ఆమె విజయం సాధించడం అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతం వేరు.. వర్తమానం వేరు
సాధారణంగా ఉపఎన్నికల్లో దివంగత నాయకుడి కుటుంబ సభ్యులకు సానుభూతి అనేది ఒకప్పుడు విజయావకాశాలకు ప్రధాన అంశంగా ఉండేది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ సానుభూతిని డామినేట్ చేసే అవకాశం ఉంది. మాగంటి సునీత తన ప్రచారంలో భర్త మరణాన్ని, మాగంటి గోపినాథ్ చేసిన సేవలను ఉద్వేగభరితంగా ప్రస్తావించడంపై కన్నీటి రాజకీయం అంటూ విమర్శలు వచ్చాయి. ఈ భావోద్వేగ ప్రచారం యువ ఓటర్లను, ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ప్రశ్నార్థకం.

Negative Winds for BRS in the Jubilee Hills By-Election

బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత కొనసాగింపు
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోవడానికి గల ప్రధాన కారణాలు - దొరల పాలన, అందుబాటులో లేకపోవడం, అహంభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటం కూడా మాగంటి సునీతకు ప్రతికూలంగా మారుతోంది. ఇది ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల నిర్లక్ష్యం అనే భావనను పెంచుతుంది. మరో వైపు మాగంటి సునీతకు వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. సొంత ఇంట్లోనే పొరపచ్చాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీగా కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు బీఆర్‌ఎస్ కేడర్‌ను బలహీనపరిచే అవకాశం ఉంది.

లీగల్ సమస్యలు
ప్రచారం సందర్భంగా మాగంటి సునీతపై, ఆమె కుమార్తెపై కేసు నమోదు కావడం (ఓటర్ స్లిప్పులు పంపిణీ విషయంలో) వంటి సంఘటనలు కొంతవరకు ప్రతికూల ప్రచారాన్ని సృష్టించాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి వంటి బలమైన పోటీదారులు బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్‌లో గతంలోనూ కాంగ్రెస్, టీడీపీ (అప్పటి టీఆర్‌ఎస్‌కు బలమైన పోటీ) బలంగా ఉండేవి. ఈసారి కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం మాగంటి సునీత విజయావకాశాలను తగ్గిస్తుంది.

నిలబడడం కష్టమే..
జూబ్లీహిల్స్‌లో ధనిక వర్గంతో పాటు, బస్తీ ప్రాంతాల ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4 లక్షల మంది ఉన్నా, పోలింగ్ శాతం కేవలం 50 శాతం లోపే నమోదవుతోంది. మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికే గెలుపు సులభమవుతున్న నేపథ్యంలో, స్థానిక సమీకరణాలు, చివరి నిమిషం మలుపులు ఇక్కడ కీలకం. కేవలం మాగంటి గోపీనాథ్ ఇమేజ్ మాత్రమే ఈ ప్రతికూల పవనాలను తట్టుకొని నిలబడడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతి అనేది మొదటి నుంచీ ఉన్నా.. మాగంటి సునీతకు సానుభూతి అనేది మొదటి నుంచీ ఉన్నా, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో నెలకొన్న సాధారణ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ ప్రచారం కారణంగా, జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం అనుమానమేనని ప్రస్తుత రాజకీయ వాతావరణం సూచిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+