నియామకాల్లో నిర్లక్ష్యం?గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బీజేపి ధ్వజమెత్తింది. వివిధ శాఖల్లో అనేక పోస్టులు పెండింగ్ లో ఉన్నాయని, సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు సకాలంలో ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఏకంగా పది సంవత్సరాల పాటు ఉద్యోగ నయామకాలు లేవంటే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నట్టేనని మండి పడ్డారు సంజయ్. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ది ఉంటే వివిధ శాఖల్లో ఉన్న భర్తీలను పూర్తి చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

విలయ తాండవం చేస్తున్న నిరుద్యోగం.. సీఎంకు ఎందుకంత నిర్లక్ష్యమన్న బండి సంజయ్
ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీ ఉన్నాయనన్నారు బండి సంజయ్ కుమార్. 10 సంవత్సరాలుగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు బండి సంజయ్ కుమార్. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు.

పదేళ్లుగా గ్రూప్ వన్ నియామకాలు లేవ్.. కేసీఆర్ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారన్న బీజేపి ఛీఫ్
ఒక్కో ఐఏఎస్ అధికారి 3, 4 పోస్టులకు ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారని, ఈ వ్యవస్థ శోచనీయమన్రారు. రాష్ట్రంలో 4 వేల గ్రూప్ -2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2 వేల గ్రూప్ -3 పోస్టులు, 40 వేల గ్రూప్ -4 పోస్టులు ఖాళీ ఉన్నాయని లెక్కలతో వివరించారు బండి సంజయ్ కుమార్. వేలాది గ్రూప్ పోస్టుల ఖాళీగా ఉండటంతో నత్తనడకన పాలన సాగుతోందన్నారు బండి సంజయ్ కుమార్.

ప్రభుత్వ పనుల్లో మందగించిన వేగం.. సరైన ఉద్యోగులు లేకనేనన్న బండి సంజయ్
ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారుల కొరత వల్ల పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరగలేకపోతున్నాయని, దీంతో చాలా పథకాలు పేదలకు అందకుండా పోతున్నాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. 25 ఏళ్లుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలు భర్తీ చేయలేదని ప్రభుత్వంపై బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

తక్షణమే పోస్టులు భర్తీ చేయాలి.. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామన్న కమల దళపతి
తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో అర్హత ఉన్న అనేక మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, కొంత మందికి వయోపరిమితి దాటిపోతోందని సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగం రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications