కూతురు వచ్చేసరికి ఏడుస్తూ తల్లి..: ఏమైందని ఆరా తీస్తే.. ఆ ఘోరం బయటపడింది
మహబూబ్‌నగర్: మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పసిపిల్లలు మొదలు వృద్ధుల దాకా కామాంధుల అఘాయిత్యానికి బలైపోతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారయత్నం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లయి భర్తతో వేరే ఊళ్లో ఉంటోంది. చిన్న కూతురు తనతోనే ఉంటోంది. సోమవారం ఏదో పని నిమిత్తం చిన్న కూతురు పక్క గ్రామానికి వెళ్లి వచ్చింది. తిరిగొచ్చేసరికి తల్లి ఏడుస్తుండటం చూసి ఏమైందని అడిగింది.

అదే గ్రామానికి చెందిన పెద్ద వెంకటన్న అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ వృద్ధురాలు ఏడుస్తూ చెప్పింది. దీంతో ఆమె కూతురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications