సజ్జనార్ కు కొత్త టెన్షన్ ? దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమీషన్ విచారణపై హాట్ డిబేట్ !!
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్ ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారా ? దిశా నిందితుల ఎన్కౌంటర్ విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతున్న సమయంలో సడన్ గా సజ్జనార్ వంటి డైనమిక్ ఆఫీసర్ ను ఆర్టీసీకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యం అదేనా? దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్ కమిషన్ విచారణతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానం ఇప్పుడు పోలీసులను వేధిస్తోందా ? సిర్పూర్కర్ కమీషన్ సుప్రీం కు ఇచ్చే నివేదిక సజ్జనార్ భవిష్యత్ మారుస్తుందా ? అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది

సజ్జనార్ ఆర్టీసీకి బదిలీ ... దిశా నిందితుల ఎన్కౌంటర్ విచారణ సమయంలో బదిలీ
ఊహించని పరిణామంగా సజ్జనార్ ను ఆర్టీసీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర కు అవకాశం కల్పించింది. సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేయడం, ఇదే సమయంలో దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిర్పూర్కర్ కమిషన్ విచారణ జరుపుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో సజ్జానార్ కు ఏమైనా ఇబ్బంది ఉందా అన్న చర్చ జరుగుతుంది.

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా సజ్జనార్ .. గతంలో యాసిడ్ దాడి కేసులోనూ ఎన్ కౌంటర్
గతంలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ అప్పుడు ఎన్ కౌంటర్ తో గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులను సైతం ఎన్ కౌంటర్ చేయడానికి కూడా ఆయన కీలక భూమిక పోషించారు. 2019 డిసెంబరు 6 వ తేదీన ఉదయం దిశ హత్యకు గురైన చోటే, సామూహిక అత్యాచారం చేసి దిశను హతమార్చినట్లుగా ప్రాథమికంగా నిందితులుగా నిర్ధారించిన నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించారు. దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంలో అప్పటి సైబరాబాద్ సిపి సజ్జనార్ పాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సుప్రీం ను ఆశ్రయించిన ప్రజా సంఘాలు .. సిర్పూర్కర్ కమీషన్ విచారణకు ఆదేశం
సజ్జనార్ ను సూపర్ హీరోగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అయితే దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ ను ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పని, కోర్టుల ద్వారా శిక్ష పడేలా చెయ్యాలని తమ వాదన వినిపించాయి. అయితే గతంలోనూ సజ్జనార్ ఈ తరహా ఎన్కౌంటర్లకు పాల్పడడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రజాసంఘాలు బూటకపు ఎన్కౌంటర్లకు చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరారు. నాలుగేళ్ల క్రితమే దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల కొంతకాలం విచారణ జాప్యం కాగా, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా విచారణ ఆలస్యమైంది.

కొనసాగుతున్న సిర్పూర్కర్ కమీషన్ విచారణ
ప్రస్తుతం కరోనా కేసులు కొద్దిగా తగ్గుతున్న క్రమంలో విచారణ మొదలు పెట్టారు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు. ఇక ఈ కమిటీ విచారణ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొనసాగుతోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సిర్పూర్కర్ కమిషన్ ఈ కేసులో 18 మంది సాక్షులను విచారణ జరుపుతోంది. ఇదే సమయంలో సిట్ దర్యాప్తు అధికారి గా ఉన్న డిసిపి నరేందర్ రెడ్డి ని కూడా కమిషన్ విచారించింది. హోంశాఖ కార్యదర్శి నుంచి జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ లోని త్రిసభ్య కమిటీ కేసుకు సంబంధించిన అదనపు వివరాలను సైతం సేకరించింది. దిశ కేసులో ఎన్ కౌంటర్ లో మరణించిన నిందితుల కుటుంబాలను సైతం సిర్పూర్కర్ కమిషన్ విచారించింది.

సిట్ దర్యాప్తు అధికారి నివేదికపై సిర్పూర్కర్ కమీషన్ అభ్యంతరం
ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలతో పాటు గా, సిట్ సమర్పించిన నివేదిక గురించి కమిషన్ సిట్ దర్యాప్తు అధికారి గా ఉన్న డిసిపి నరేందర్ రెడ్డి ని విచారించింది. ఇక విచారణ సందర్భంగా సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న నరేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఏమాత్రం పొంతన లేకుండా ఉండడంతో, సిట్ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవడానికి సిర్పూర్కర్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ కౌంటర్ కు గురైన నిందితుల కుటుంబ సభ్యులు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్న క్రమంలో వారు పోలీసులతో తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జ్యుడిషియల్ కమిషన్ బాధిత కుటుంబ సభ్యులకు తక్షణమే రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే బాధిత కుటుంబాల విచారణను నిర్వహించిన కమిషన్ కు, బాధితుల తరపున హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచారి వివరాలు అందించారు.
Recommended Video

సజ్జనార్ భవిష్యత్ నిర్ణయించేది ఎన్ కౌంటర్ పై కమీషన్ నివేదికనే
ప్రస్తుతం కొనసాగుతున్న సిర్పూర్కర్ కమిషన్ విచారణలో దిశా నిందితుల ఎన్కౌంటర్ బూటకమని కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తే, పోలీస్ శాఖలో సూపర్ పోలీస్ గా గుర్తింపు పొందిన సజ్జనార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని టాక్ వినిపిస్తుంది. సిట్ నివేదికపై సిర్పూర్కర్ కమీషన్ అసహనం వ్యక్తం చెయ్యటం అందుకు అద్దం పడుతుంది. మొదటి నుండి పోలీసు శాఖలో కీలకంగా పనిచేసిన సజ్జనార్ ను అనూహ్యంగా ఆర్టీసీకి ఎండీగా బదిలీ చేయడం వెనుక దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జరుగుతున్న విచారణ ఉందని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఈ ఎన్కౌంటర్ విషయంలో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికపైనే సజ్జనార్ భవితవ్యం ఆధారపడి ఉందనేది సుస్పష్టం.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications