బ్యూటీషియన్-ఎస్సై కేసులో షాకింగ్ ట్విస్ట్‌లు: పరిచయం ఎలా? రాజీవ్ కీలకం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/కరీంనగర్: కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. హైదరాబాదులోని ఫిలిం నగర్లో శిరీష అనే బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసుతో ఎస్సైకి లింక్ ఉందనే ప్రచారం సాగుతోంది.

చదవండి: బ్యూటీషియన్ రాత్రి అక్కడ ఎందుకు ఉంది?

ఈ నేపథ్యంలో తాజాగా మరో విషయం వెలుగు చూసిందని తెలుస్తోంది. శిరీషకు, ఎస్సై ప్రభాకర్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ రెండు కేసులను అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

పోలీసులకు కొత్త విషయాలు

పోలీసులకు కొత్త విషయాలు

ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయని అంటున్నారు. ఆమె మృతిపై ఆర్జే ఫొటోగ్రఫి వల్లభనేని రాజీవ్ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు శిరీష మృతదేహానికి పంచనామ నిర్వహించి, మృతిపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులు పాలకొల్లు తరలించారు.

శిరీషకు ప్రభాకర్ రెడ్డికి మధ్య పరిచయం

శిరీషకు ప్రభాకర్ రెడ్డికి మధ్య పరిచయం

శిరీష మృతదేహాన్ని పంపిన తర్వాత ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలించారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. శిరీషకు కుకునూరుపల్లి ఎస్సైతో ప్రభాకర్ రెడ్డితో గత కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు వెలుగు చూసిందని తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే అనూహ్యరీతిలో ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కేసులో రాజీవ్ కీలకం

కేసులో రాజీవ్ కీలకం

అయితే పోలీసులు ప్రభాకర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ రెండు కేసులకు సంబంధం ఉన్నట్లుగా తేలిందని ప్రచారం సాగుతోంది. వెంటనే పోలీసులు ప్రభాకర్ రెడ్డి, శిరీషకు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేపట్టారని సమాచారం. ఈ కేసులో రాజీవ్ కీలకంగా మారాడు. రాజీవ్‌తో పాటు ఆయన స్నేహితుడు శ్రవణ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కుముడి వీడాలంటే వీరు మరిన్ని విషయాలు చెప్పాలని అంటున్నారు. ఇప్పటికే పోలీసులు వీరి నుంచి పలు విషయాలు సేకరించారు. మరిన్ని రాబట్టాల్సి ఉంది.

అసలేం జరిగిందని..

అసలేం జరిగిందని..

ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? రెండు రోజుల క్రితం ఏం జరిగింది? వీళ్లిద్దరి ఆత్మహత్యలకు గల కారణాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాజీవ్‌ను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.

పోలీసుల మోహరింపు, ఎస్సై ఇంటికి నేతల క్యూ

పోలీసుల మోహరింపు, ఎస్సై ఇంటికి నేతల క్యూ

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఉన్న కుకునూరుపల్లిలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ గ్రామస్థులు మీడియా వాహనంపై దాడికి పాల్పడ్డారు. కుకునూరుపల్లిలో ఘటనా స్థలానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, టిడిపి నేత ప్రతాప్‌ రెడ్డి, కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.

మంత్రి హరీష్ రావు స్పందన

మంత్రి హరీష్ రావు స్పందన

ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటనపై మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. పోలీసులు మనో ధైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు కాగా, కేసు విచారణ అధికారిగా అదనపు డీజీ గోపీకృష్ణను డీజీపీ అనురాగ్ శర్మ నియమించారు. అన్ని కోణాల్లో విచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A new twist took place over the suicide issue of Kukunoorpally SI Prabhakar Reddy in Siddipet. It is alleged that beautician Sirisha and her team, who went Kukunoorpally two days ago, faced some problems from SI Prabhakar Reddy.
Please Wait while comments are loading...