వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిశు విక్రయాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీలు.. ఆరుగురి గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల మహిళల ముఠాను వరంగల్ నగరంలోని ఇంతెజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు ఒక శిశువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో విజయవాడకు చెందిన ముదావత్ శారద, వరంగల్ జిల్లాకు చెందిన రుద్రారపు స్వరూప, మహారాష్ట్రకు చెందిన అనురాధ అక్షయ్ కొరి, సల్మా యూనిస్ షేక్ ఆలియాస్ హరతి, గుజరాత్ కు చెందిన పాట్ని శైలబేన్, వరంగల్ జిల్లాకు చెందిన ఓదేల అనిత ఉన్నారు. ఇక ఈ గ్యాంగులో సిద్దిపేటకు చెందిన ట్రాన్స్జెండర్ సునీత ప్రసుత్తం పరారీలో ఉన్నారు.

శిశు విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

శిశు విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు


ఈ ముఠా అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ముఠా సభ్యులైన రుద్రారపు స్వరూప మరియు ఓదేల అనిత ఇద్దరు స్నేహితులు. వీరికి గత కొద్ది రోజుల క్రితం సిద్దిపేటకు చెందిన ట్రాన్స్ జెండర్ సునీతతో పరిచయం అయింది. ఈ పరిచయంతో ట్రాన్స్ జెండర్ సునీత తాను పెంచుకోనేందుకుగాను ఒక ఆడ శిశువును అందజేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని స్వరూప, అనితలకు తెలపడంతో, డబ్బుపై ఆశతో నిందితురాలు స్వరూప, అనితలకు పరిచయం వున్న ప్రధాన నిందితురాలు శారదకు శిశువు కావాలని అడిగారు. వీరికి 2లక్షల 50వేల రూపాయలకు ఆడ శిశువు అప్పగించేందుకుగాను నిందితురాళ్ళ మధ్య ఒప్పందం కుదిరింది.

శిశు విక్రయ డీల్ లో గొడవ

శిశు విక్రయ డీల్ లో గొడవ


శారద ఆడశిశువును తీసుకోని గత నెల 22వ తేదిన వరంగల్ లో ట్రాన్స్ జెండర్ సునీతకు అందజేయడంతో ఒప్పందం ప్రకారం ట్రాన్స్ జెండర్ సునీత శారదకు 2లక్షల 50వేల రూపాయలను ఇచ్చి తిరిగి సిద్దిపేట వెళ్ళిపోయింది. కొద్ది రోజుల అనంతరం నిందితురాలు శారద విక్రయించిన ఆడ శిశువుకు ప్రాణంతకమైన వ్యాధి వుందని గుర్తించిన ట్రాన్స్ జెండర్ సునీత తనకు ఇచ్చిన శిశువు వద్దని, ఆ స్థానంలో మరో శిశువును అందజేయాల్సిందిగా శారదపై ఒత్తిడి చేయడంతో శారద ఫిబ్రవరి 10వ తేదీన మహరాష్ట్రకు చెందిన శీలా, సల్మాల వద్ద శిశువు కోసం డీల్ చేసుకుంది.

వరంగల్ లాడ్జ్ లో శిశు విక్రయాలు చేసే గ్యాంగ్ మధ్య ఘర్షణ

వరంగల్ లాడ్జ్ లో శిశు విక్రయాలు చేసే గ్యాంగ్ మధ్య ఘర్షణ

ఇక వారు తీసుక వచ్చిన మరో ఆడశిశువుని తీసుకోని వరంగల్ బస్టాండ్ పరిసరాల్లోని లాడ్జ్ కి చేరుకోని తమ వద్ద వున్న శిశువు అందజేసేందుకు మహరాష్ట్రకు చెందిన నిందితురాళ్ళు మరింత ఎక్కువ డబ్బును డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన నిందితురాలు శారద మహరాష్ట్రకు చెందిన నిందితురాళ్ళ వద్ద వున్న శిశువును లాక్కోని సునీత చేతిలో పెట్టి, అనారోగ్యంతో బాధపడుతున్న శిశువుని వారిచేతిలో పెట్టి లాడ్జ్ నుండి శారద, సునీత పారిపోయారు. ఈ క్రమంలో లాడ్జ్ లో జరుగుతున్న శిశు విక్రయాలపై సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫెర్ విభాగం అధికారులు లాడ్జ్ లో వున్న మహరాష్ట్రకు చెందిన నిందితురాళ్ళు అనురాధ, శీలా, సల్మాల వద్ద వున్న శిశువు గురించి విచారించడంతో శిశువు తల్లిని తీసుకు వస్తామని చెప్పి అక్కడినుండి మహరాష్ట్రకు చెందిన నిందితురాళ్ళు తప్పించుకున్నారు.

శిశు విక్రయాలు చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్

శిశు విక్రయాలు చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్


చైల్డ్ వెల్పైర్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇంతేజా గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి శిశు విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. తప్పించుకోని పారిపోయిన నిందితులు అందరూ వరంగల్ కు చెందిన నిందితురాలు రుద్రారపు స్వరూప పిలవడంతో మంగళవారం నాడు ఉదయం వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పార్కుకు రాగా పోలీసులకు సమాచారం అందడంతో ఇంతేజార్ గంజ్ పోలీసులు వెళ్ళి నిందితురాళ్ళను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా వారు చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు.

English summary
newborn babies trafficking gang caught by police in warangal.Intezargunj police caught six women who are doing babies trafficking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X