ఎందుకిలా :పెళ్ళేై నాలుగు మాసాలే, దంపతులిలా చేశారు

పెళ్ళి జరిగి నాలుగు మాసాలే, చిన్న గొడవకే భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఈ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైదరాబాద్ :పెళ్ళి జరిగి నాలుగు మాసాలే, చిన్న గొడవకే భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఈ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని కెందర్ పడ జిల్లా పాటియా గ్రామానికి చెందిన నిర్మల్ , అతని భార్య మినతి బతుకుదెరువు కోసం హైద్రాబాద్ లోని ఐడిఏ బొల్లారంలో నివాసం ఉంటున్నారు.

నాలుగు మాసాల క్రితమే మినతిని నిర్మల్ వివాహం చేసుకొన్నాడు. ఐడిఏ బొల్లారంలో నిర్మల్ ప్లంబర్ గా పనిచేస్తున్నాడు.అయితే సోమవారం నాడు ఉదయం భార్య, భర్తల మద్య చిన్న గొడవ జరిగింది.

newly married couple suicide in Hyderabad

ఈ గొడవ తర్వాత నిర్మల్ పనికి వెళ్ళాడు. మధ్యాహ్నం పూట బోజనానికి వచ్చిన నిర్మల్ కు భార్య కన్పించలేదు. బాత్ రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి ఆమె చున్నీతో ఉరివేసుకొని కన్పించింది.

మినతి చనిపోవడంతో మనస్థాపానికి గురైన నిర్మల్ కూడ ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే భార్య, భర్తల మద్య గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+