తెలంగాణలో మరో 72 గంటలపాటు వానలు: పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు

హైదరాబాద్: రెండు రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రవేశిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Recommended Video

    Southwest Monsoon కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం | Weather Update | IMD || Oneindia Telugu

    మే 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

     next 72 hours rains in telangana state wide

    సోమవారం మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ద్రోణి మంగళవారం బలహీనపడిందని తెలిపారు. కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

    సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు జిల్లాల్లోనూ వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దైంది. దీంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+