NH-563 కరీంనగర్ వరంగల్ మధ్య NH-563పై సంతోషకరమైన అప్డేట్!

తెలంగాణా రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజల అవసరాలకు తగ్గట్టు రహదారుల విస్తరణ చేపడుతున్న విషయం తెలిసిందే. రవాణా సదుపాయాలు మెరుగుపడితే ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి రవాణా సదుపాయాల మెరుగుదలకు కేంద్రం కృషి చేస్తోంది. ఇక ఇదే క్రమంలో NH-563 నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం పనులపై ప్రజలకు శుభవార్త చెప్పింది.

తుది దశకు జాతీయ రహదారి-563 ఫోర్ లైన్ ప్రాజెక్టు

ఉత్తర తెలంగాణలో కేంద్రం చొరవతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. కరీంనగర్ నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-563 ఫోర్ లైన్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. రూ.1,641 కోట్ల వ్యయంతో 68.015 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ రహదారి త్వరలోనే అందుబాటులోకి రానుంది. మానకొండూరు బైపాస్ నుంచి ప్రారంభమై హనుమకొండ సమీపంలోని పలివేల్పుల వరకు ఈ మార్గం సాగుతుంది.

NH-563 Karimnagar Warangal four-lane highway between Karimnagar and Warangal is in final stages

కొత్త ఫోర్ లైన్‌తో ప్రయాణ సమయం 45 నిమిషాలకు తగ్గే అవకాశం

శంకరపట్నం, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి వంటి ప్రాంతాలకు ఇది ముఖ్యమైన అనుసంధానం అవుతుంది. ప్రస్తుతం రెండు వరుసల రహదారిలో రద్దీ, సమయం ఎక్కువగా పడుతుండగా, కొత్త ఫోర్ లైన్‌తో ప్రయాణ సమయం 45 నిమిషాలకు తగ్గనుంది. ఈ రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీల కెమెరాలు ఉంటాయి.

ఈ రహదారి నిర్మాణంలో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్

ప్రమాదాలు లేదా రద్దీ ఏర్పడితే వెంటనే గుర్తించి డిజిటల్ బోర్డుల ద్వారా హెచ్చరిస్తారు.1033 హెల్ప్‌లైన్, పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సులు, క్రేన్లు సిద్ధంగా ఉంటాయి.పర్యావరణ పరిరక్షణకు కూడా చర్యలు తీసుకున్నారు. 25 చోట్ల భూగర్భ జలాల పునరుద్ధరణ నిర్మాణాలు, రహదారి ఇరువైపులా మొక్కలు నాటారు. 9 పెద్ద వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్‌లు, 25 అండర్‌పాస్‌లు నిర్మించారు.

రాజస్థాన్ కోటల్లా ఆ కోటలు వెలిగిపోతాయ్.. పర్యాటక శాఖ బిగ్ ప్లాన్!
రాజస్థాన్ కోటల్లా ఆ కోటలు వెలిగిపోతాయ్.. పర్యాటక శాఖ బిగ్ ప్లాన్!

అందుబాటులోకి వస్తే వరంగల్, కరీంనగర్ వాసులకు పండుగే

మానకొండూరు వద్ద 560 మీటర్ల పొడవైన వంతెన ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఈ హైవే పూర్తయితే కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమలకు, హనుమకొండలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కు సరకు రవాణా సులభమవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా వ్యవసాయ మార్కెట్లకు చేరతాయి. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇది కీలక మైలురాయి అవుతుంది. త్వరలోనే పూర్తి కానున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్, కరీంనగర్ వాసులకు పండుగే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+