నేషనల్ హైవేపై వారికి నెలవారీ పాస్ 350రూపాయలకే.. ఎన్నిసార్లైనా ట్రావెల్ చెయ్యొచ్చు!

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే స్థానిక వాహనదారులకు ఎన్‌హెచ్‌ఏఐ బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 121 టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకం కింద సంబంధిత టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హత కలిగిన స్థానికులు కేవలం రూ.350 చెల్లించి నెలవారీ పాస్ పొందవచ్చు.

స్థానికులకు ఎన్హెచ్ పై రూ.350 చెల్లిస్తే నెలవారీ పాస్

ఈ పాస్ ద్వారా ఆ టోల్‌ప్లాజా మీదుగా నెల రోజుల పాటు ఎన్నిసార్లైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ డిజిటల్ లోకల్ పాస్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. వాణిజ్యేతర వాహనాలు కలిగిన అర్హులైన వినియోగదారులు రాజమార్గయాత్ర మొబైల్ యాప్ ద్వారా ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడి చిరునామా, వాహన వివరాలు, ఫాస్టాగ్ వంటి సమాచారాన్ని డిజీలాకర్, వాహన్ పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరిస్తారు.

NHAI local toll pass A monthly pass for them on the national highway costs just 350 allowing for unlimited travel

ఫాస్టాగ్‌తో అనుసంధానమయ్యే డిజిటల్ పాస్

దీనివల్ల గతంలోలా పత్రాలు పట్టుకుని టోల్‌ప్లాజా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పాస్ మంజూరైన తర్వాత అది నేరుగా సంబంధిత వాహనం ఫాస్టాగ్‌తో అనుసంధానమవుతుంది. దీనివల్ల టోల్‌ప్లాజా వద్ద స్థానిక వాహనదారులను సులభంగా గుర్తించే వీలు కలుగుతుంది. ఈ చర్య బ్యారియర్-రహిత 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' టోలింగ్ వ్యవస్థను భవిష్యత్తులో అమలు చేసే దిశగా ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతున్న ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు.

లోకల్ పాస్ లేకుండా ప్రయాణించే స్థానికులకు డిజిటల్ షాక్

కొత్త ఆటోమేటెడ్ టోల్ విధానం అమల్లోకి వస్తే సరైన లోకల్ పాస్ లేకుండా ప్రయాణించే స్థానికులకు ఈ-నోటీసులు రావచ్చు. అలాంటి ఇబ్బందులను నివారించేందుకే ఈ డిజిటల్ పాస్‌ను ప్రోత్సహిస్తోంది NHAI . దేశంలో తొలి డిజిటల్ లోకల్ పాస్‌ను గత నెలలో ఢిల్లీలోని ముండ్కా-బక్కర్‌వాలా టోల్‌ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి ప్రస్తుతం 121 టోల్‌ప్లాజాల్లో అందుబాటులోకి తెచ్చారు.

121 టోల్‌ప్లాజాలలో అందుబాటులో లోకల్ పాస్

ఈ 121 టోల్‌ప్లాజాల పూర్తి జాబితాను రాజమార్గ్ యాత్ర యాప్‌లో చూడవచ్చు. అయితే 20కిలోమీటర్ల పరిధికి అవతల నివసించే వారికి ఈ రూ.350 పాస్ వర్తించదు. డిజిటల్ పాస్ సదుపాయం లేని టోల్‌ప్లాజాల వద్ద అర్హులు పాత విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నేరుగా సంబంధిత టోల్‌ప్లాజా కార్యాలయాన్ని సంప్రదించాలి. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ నెలవారీ రూ.350 లోకల్ పాస్‌ను ఎన్‌హెచ్‌ఏఐ అందిస్తున్న వార్షిక పాస్‌తో కలపకూడదు.

హైదరాబాద్ లో భూగర్భ మెట్రో.. ఈ మార్గాలలోనే.. సక్సెస్ అయితే
హైదరాబాద్ లో భూగర్భ మెట్రో.. ఈ మార్గాలలోనే.. సక్సెస్ అయితే

ఇయర్ పాస్... నెలవారీ పాస్ రెండూ వేర్వేరు ప్రయోజనాలు

2026-27 సంవత్సరానికి రూ.3,075గా నిర్ణయించిన వార్షిక పాస్‌కు ఇది పూర్తిగా భిన్నమైనది. రెండింటి అర్హతలు, ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. స్థానిక వాహనదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని టోల్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. యాప్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకుని, ఫాస్టాగ్‌తో లింక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+