హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ఐఏ విచారణ: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసింది. గత నాలుగైదు రోజులుగా అధికారులు పలువురు అనుమానితులను విచారించారు. ఇటీవల బాలాపూర్‌లోని షఆయిన్ నగర్‌లో సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఇరవై మందికి నోటీసులు జారీ చేసింది. వారందరినీ విచారించింది.

విచారణ అనంతరం ఇద్దరిని అరెస్టు చేశారు. మహమ్మద్ అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదీర్‌లను పోలీసులు విచారించి, వారికి ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. హైదరాబాదులో ఐసిస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం, ఆ ఉగ్రవాద సంస్థ వైపు యువకులను ఆకర్షించేలా చేయడంలో వీరు కీలకపాత్ర పోషించినట్లు విచారణలో తేలింది.

 NIA arrests 2 Hyderabad men for having links with ISIS

ఎన్ఐఏ అధికారులు వారం రోజులుగా నిందితులైన అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదీర్‌లను విచారించారు. ఖాదీర్ ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్ ఆధారంగా దర్యాఫ్తు చేశారు. అద్నాన్ హసన్ కేసులో వీరిద్దరినీ నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. టెస్టుల కోసం సీఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు.

2016లో కేసులో వీరిద్దరిని ఎన్ఐఏ నిందితులుగా పేర్కొంది. నాటి కేసులో ఇప్పటికే ఎన్ఐఏ ఛార్జీషీటు దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేశారు. యువతను తమ వైపు తిప్పుకునేందుకు వీరు ప్రచారం నిర్వహించారు. మూడు సార్లు సిరియా వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని.. పోలీసులు ముందుగా గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కానీ తీరు మారలేదు.

English summary
Two men were arrested by the National Investigation Agency (NIA) from Hyderabad for conspiring to carry out terror activities in India on the instructions of ISIS. The two suspects were arrested on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X