తెలంగాణా లో నైట్ కర్ఫ్యూ: సీఎస్ రివ్యూ మీటింగ్, రాత్రి కర్ఫ్యూ విధింపుపై సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ !!
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో దేశంలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ , 144 సెక్షన్, నైట్ కర్ఫ్యూ లను విధించి కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలోనూ బాగా పెరిగి పోతున్న కేసులతో సర్కార్ కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రటరీ సమీక్ష.. ఆపై సీఎం ను కలిసి నిర్ణయం
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కేసులతో తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించే దిశగా ఆలోచనలు సాగిస్తోంది తెలంగాణా సర్కార్ . ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రటరీ సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన తరువాత సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ముఖ్యమంత్రిని సంప్రదించిన తరువాత రాత్రి కర్ఫ్యూ విధింపు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

మహారాష్ట్ర నుండి తెలంగాణాకు పెరుగుతున్న వలసలు.. భారీగా తెలంగాణలో కేసులు
ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో కేసుల పెరుగుదలతో కరోనా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న క్రమంలో ముఖ్యంగా మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి వలసలు పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి వలసలను కట్టడి చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ దారుణమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే పెరిగిపోతున్న కేసులతో ఆందోళనలో ఉన్న సర్కార్ కఠిన ఆంక్షలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.

స్థానిక కట్టడికే ప్రాధాన్యతనిస్తున్న కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నా ప్రజలు సామాజిక దూరం నిబంధనలు పాటించక పోవడం, మాస్కులను ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం కఠిన ఆంక్షల దిశగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తుంది . ఈ నేపథ్యంలో స్థానికంగా కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు నిర్ణయాలను తీసుకుంటున్నాయి.

నైట్ కర్ఫ్యూపై సర్కార్ సమాలోచనలు , కేసీఆర్ ఓకే అంటే నైట్ కర్ఫ్యూ విధింపు
ఢిల్లీ మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో 144 సెక్షన్ తో పాటుగా, నైట్ కర్ఫ్యూ విధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ నైట్ కర్ఫ్యూ విధించడానికి ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ నైట్ కర్ఫ్యూ విధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానిని ప్రకటించే అవకాశం ఉంది.
Recommended Video

నైట్ కర్ఫ్యూ విధిస్తే వారికి మినహాయింపులు
ఒకవేళ నైట్ కర్ఫ్యూ విధిస్తే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది, మిలిటరీ లేదా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభిస్తుంది .మీడియా, ఆరోగ్యం, విద్యుత్ లేదా అగ్నిమాపక విభాగంలో పనిచేసే వారు తమ విధులను నిర్వర్తించడానికి రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి , గర్భిణీ స్త్రీలు మరియు వైద్య పరిస్థితులతో ఉన్నవారు కూడా ఆసుపత్రులకు లేదా వైద్య కేంద్రాలకు వెళ్లడానికి అనుమతించబడతారు.
రాత్రి వేళల్లో ప్రయాణించాలనుకునే ఎవరైనా కర్ఫ్యూ పాస్ పొందాలి. అంతర్-రాష్ట్ర రవాణాపై ఎటువంటి నిషేధం ఉండదు. రాత్రి కర్ఫ్యూ సమయంలో, ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్స్ మరియు ఎటిఎంలు తెరిచి ఉంటాయని భావిస్తున్నారు .
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications