వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందు నీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూడు.. హరీష్ రావుకు నిర్మలా సీతారామన్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రజా వ్యతిరేక విధానాలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు.

ఇక ఇదే సమయంలో కామారెడ్డి కలెక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మలా సీతారామన్ రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు లేకపోవడంపై మండిపడ్డారు . ఇక కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై మండిపడిన హరీష్ రావు ఆమె అసత్యాలు, అర్థసత్యాలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన నిర్మలా సీతారామన్

మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన నిర్మలా సీతారామన్

ఇక తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నిర్మల సీతారామన్ రివర్స్ ఎటాక్ చేశారు. ఒక ప్రశ్న అడిగితే నన్నే ప్రశ్నిస్తారా అంటూ మాట్లాడిన వాళ్లకు చెప్తున్నా అంటూ హరీష్ రావు పై విరుచుకుపడ్డ నిర్మలాసీతారామన్ 2014 నుండి రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, ప్రధాని నరేంద్ర మోడీకి ఏ రాష్ట్రానికి ఏం కావాలో తెలుసని పేర్కొన్నారు. కేంద్రాన్ని బదనాం చేయడం కోసం రాష్ట్ర మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారని నిర్మల సీతారామన్ మండిపడ్డారు.

ముందు నీ రాష్ట్రం చూసుకో.. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో : హరీష్ రావును ఎద్దేవా

ముందు నీ రాష్ట్రం చూసుకో.. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో : హరీష్ రావును ఎద్దేవా

రాష్ట్రంలో ఒక బలమైన వాతావరణం ఏర్పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్మల సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో ఎవరైనా రాజకీయాలు చేయడానికి వీలు లేదని, రైతుల గురించి అనుమానాస్పదంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నిర్మల సీతారామన్ మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు.. ముందు నీ రాష్ట్రం చూసుకో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో అంటూ హరీష్ రావును ఎద్దేవా చేశారు.

కేంద్రంపై రైతులకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

కేంద్రంపై రైతులకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతులకు ఇవ్వాలని మంత్రి నిర్మల సీతారామన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా.. రైతుల కోసమే కదా అంటూ ప్రశ్నించిన నిర్మలాసీతారామన్, ఎవరు ఎక్కువ ఇచ్చారు ఎవరు తక్కువ ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు జొన్న పంట వెయ్యొద్దు అని బెదిరిస్తుంది అని నిర్మల సీతారామన్ మండిపడ్డారు. వారి పంట కేంద్రం కొనుగోలు చేయడం లేదని ప్రచారం చేస్తుందని, ఇక వరి వేస్తే ఉరే అంటూ బెదిరింపు రాజకీయాలకు తెరతీసింది అని మండిపడ్డారు.

రైతులపై మీకంత ప్రేమ ఉంటే రైతుల ఆత్మహత్యలు దేనికి చేసుకుంటున్నారు చెప్పండి

రైతులపై మీకంత ప్రేమ ఉంటే రైతుల ఆత్మహత్యలు దేనికి చేసుకుంటున్నారు చెప్పండి

ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు చూసుకోమని చేస్తున్న వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన నిర్మల సీతారామన్ ముందు నీ రాష్ట్రం చూసుకోమని హితవు పలికారు. రైతులపై మీకు అంత ప్రేమ ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది చెప్పాలని నిర్మల సీతారామన్ ప్రశ్నించారు.

రైతుల రుణమాఫీ విషయంలో తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్

రైతుల రుణమాఫీ విషయంలో తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్

రైతుల రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కారు తీరుపై నిర్మల సీతారామన్ విరుచుకుపడ్డారు. ఒక ప్రశ్న అడిగితే నన్నే ప్రశ్నిస్తారా అని అడిగే వాడికి చెబుతున్నాను అంటూ మంత్రి హరీష్ రావు ను టార్గెట్ చేశారు. అన్ని రాష్ట్రాలలో ఎంత రుణమాఫీ అయింది లెక్కలు చెప్పిన నిర్మలా సీతారామన్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం ఏం చేసిందనేది ఏకరువు పెట్టారు. పక్కా లెక్కలతో మాత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు.

English summary
Union Minister Nirmala Sitharaman countered Harish Rao by saying, Look at the suicides of farmers in your state first
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X