నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ రైతులపై చర్చ .. మోడీపై నామినేషన్ వేసేందుకు నేడు వారణాసికి వెళ్లనున్న 50మంది రైతులు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ రైతులు మరోమారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితను టార్గెట్ చేస్తే, ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని , టార్గెట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించేవరకు ఉద్యమం ఆపమని నిర్ణయం తీసుకున్న రైతన్నలు ఎన్నికల బరిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.

వారణాసికి బయలుదేరిన 50 మంది రైతులు .. 27న నామినేషన్లు వేసే అవకాశం

వారణాసికి బయలుదేరిన 50 మంది రైతులు .. 27న నామినేషన్లు వేసే అవకాశం

తెలంగాణా రాష్ట్రంలో నిజామాబాద్ రైతులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..వారణాసి నుంచి మోదీపై పోటీ చేయడానికి సిద్దమయ్యారు. 50మంది రైతులు ట్రైన్ లో గురువారం వారణాసి బయలుదేరి వెళ్లనున్నారు.నిజామాబాద్ రైతులకు తోడు తమిళనాడు లోని హిరోడ్ ప్రాంతానికి చెందిన మరో 100మంది వరకు రైతులు సైతం నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో మరోసారి పసుపు రైతుల ఇష్యూ దేశ వ్యాప్తంగా చర్చానీయంశంకానుంది.

మోడీకి పోటీగా వారణాసినుండి నామినేషన్లు వెయ్యనున్న రైతులు

మోడీకి పోటీగా వారణాసినుండి నామినేషన్లు వెయ్యనున్న రైతులు

నిజామాబాద్ పసుపు రైతులు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోకసభ స్థానం నుంచి పోటి చేయడానికి సిద్దమయ్యారు.వారణాసి నుంచి ప్రదాని మోది పోటి చేస్తువుండటంతో ఇదే లోకసభ స్థానం నుంచి పోటిచేస్తే పసుపు రైతుల సమస్య మరోసారి జాతీయస్తాయిలో చర్చ జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే పసుపు రైతులు ఇ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈనెల 29 వరకు నామినేషన్ల గడువు ముగిస్తువుండటంతో 25వతేదిన గురువారం రోజున నేడు ట్రైన్ లో వారణాసి వెళ్తున్నారు .అక్కడి చేరుకున్న తర్వాత పోటిచేసే రైతులంతా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 27వతేది నామినేషన్ వేస్తారు..నామినేషన్లు వేసిన తర్వాత స్కూట్ని ప్రక్రియ,నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిసేంత వరకు అక్కడే వుండనున్నారు..దినికి సంబందించి వారికి ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ సైతం తాయారు చేసుకున్నట్లు తెలుస్తుంది...

నిజామాబాద్ రైతులకు తోడుగా హిరోడ్ ప్రాంత రైతుల నామినేషన్లు .. పసుపు సమస్య పరిష్కారం కోసం రైతన్నల నిర్ణయం

నిజామాబాద్ రైతులకు తోడుగా హిరోడ్ ప్రాంత రైతుల నామినేషన్లు .. పసుపు సమస్య పరిష్కారం కోసం రైతన్నల నిర్ణయం

నిజామాబాద్ రైతులకు తోడు తమిళనాడులోని హిరోడ్ ప్రాంతంకు చెందిన మరో 100మంది రైతుల వరకు నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తుంది.తెలంగాణలో నిజామాబాద్ లోని ఆర్మూర్ డివిజన్ లో పసుపు పంట కు ఏంత ప్రాముఖ్యమో తమిళనాడులోని హిరోడ్ ప్రాంతం కూడ పసుపు పంటకు అంత ఫేమస్...అందుకే వారు కూడ నిజామాబాద్ రైతులకు మద్దతు ప్రకటించి వారు కూడ పోటిచేయడానికి సిద్దమయ్యారు..ఇలా అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తే తప్ప పసుపు రైతుల సమస్యలు పరిష్కారం అవుతుందంటున్నారు రైతులు.

రైతుల పోటీతో చరిత్రలో నిలవనున్న వారణాసి లోకసభ స్థానం

రైతుల పోటీతో చరిత్రలో నిలవనున్న వారణాసి లోకసభ స్థానం

నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 178మంది రైతులు బరిలో నిల్చోవడం ద్వారా పసుపు రైతుల సమస్య జాతీయ స్తాయిలో చర్చానీయంశమైన విషయం తెలిసిందే. ఇదే స్పూర్తితో ముందుకు వెళితే ఖచ్చితంగా పసుపు బోర్డ్ కల సాకారం అవుతుందన్న ఉద్దేశ్యంతో మోదిపై నిల్చోవడానికి రైతులు సై అంటున్నారు. అయితే వారణాసి బరిలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 100మందికి పైగా అభ్యర్థులు బరిలో వుంటే అక్కడ కూడ ఒక పోలింగ్ కేంద్రంకు 8నుంచి 12ఈవిఎంలను ఒక కంట్రోల్ యూనిట్, ఒక వివి ప్యాట్ కు అనుసంధానం చేసి ఎన్నికలను నిర్వహించాల్సి వుంటుంది.ఇదే జరిగితే దేశ చరిత్రలో నిజామాబాద్ తర్వాత వారణాసి లోకసభ స్థానం కూడ చరిత్రలో నిలవనుంది . మొత్తానికి మరోసారి పసుపు రైతుల ఇష్యూ దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. నిజామాబాద్ బరిలో నిలవడం ఒక ఏత్తైయితే ఏకంగా ప్రదాని మోదీ పోటిచేస్తున్న వారణాసి నుంచి బరిలో నిలవడం మరో ఎత్తు కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మరోసారి పసుపు రైతుల పైన పడింది .

English summary
As many as 50 turmeric farmers under Telangana Turmeric Farmers Association would be filing nominations from Prime Minister Narendra Modi's Lok Sabha Constituency Varanasi in Uttar Pradesh. The Turmeric Farmers Association Nizamabad district president P Tirupati Reddy said that about 50 farmers from Armoor, Balkonda and Nizamabad would be going to Varanasi and would be filing nominations. The farmers from Erode from Tamil Nadu led by V K Daivaligamani would also be filing nominations. ''Our main intention is get Turmeric Board and MSP for Crop. We will not be campaigning against or for any candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X