హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేపటి తరాలకు నాణ్యమైన విధ్యను హక్కుగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి యేడు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక థింక్ ఎడ్యుకేషన్ 2015 సెమినార్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్గొని మాట్లాడారు.

చెన్నైలోని ఐటిసీ చోళ హోటల్ లో ఈనెల 20, 21 తేదీలలో జరిగిన ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 40 మంది వివిధ రంగాలలోని ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సెమినార్ లో పాల్ఘొన్న ఎంపీ శ్రీమతి కవిత మన విద్య వ్యవస్తలో రావలసిన మార్పుల గురించి ప్రత్యేకించి బాలికల విద్యకు తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు.

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్


ఈ సందర్భంగా ఆమె గ్రీన్ రన్‌ని జెండూ ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ ఇక ఆకుపచ్చ శోభను సంతరించుకోబోతోందన్నారు.

 జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్


జంట నగరాల్లో ఎంపిక చేసిన వంద కూడళ్లలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

హరిథాన్ చైర్‌పర్సన్ సంజీవ్ రావడి మాట్లాడుతూ వ్యర్థాలు, కాలుష్యం, ఇతర పర్యావరణ కాలుష్య కారకాలపై సామాజిక చైతన్యం కోసం చేపట్టిన రన్‌లో వేలాది మంది పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

 జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్


గ్రీన్ రన్‌తో పాటు ఎగ్జిబిషన్‌ని గ్రీన్ ఎంటర్ ప్రిన్యూర్‌లు ఏర్పాటు చేశారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌లోనూ ఎక్ ప్రెండ్లీ ఉత్పత్తులు లైఫ్ స్టైల్, ఈ వేస్ట్, పేపర్ వేస్ట్ కలెక్షన్, గ్రీన్ నెట్ వర్కింగ్, ఆర్గానిక్ టీ షర్ట్ , గ్రీన్ మర్చండైజ్ ప్రదర్శించారు.

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్


పలు రాక్ బ్యాండ్‌ల ప్రదర్శనతో పాటు జుంబా డ్యాన్స్, ప్రత్యేకమైన సెల్ఫీ పాడ్స్‌తో స్పెషల్ సెల్ఫీ జోన్స్ వంటివి ఏర్పాటు చేశారు.

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్


పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పట్ల తమ బాధ్యతని నగరవాసులకి తెలియజేస్తూనే అత్యుత్తమ జీవనం కొరకు పర్యావరణ పరిరక్షణకి పాటు పడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్లానెట్ 3 ప్రొటెక్షన్ అలయెన్స్ స్వచ్ఛంద సంస్ధ 5వ ఎడిషన్ హరిథాన్-గ్రీన్ రన్-2కె15ని ఆదివారం ఉదయం 7 గంటలకి పీపుల్స్ ప్లాజా, నెక్లస్ రోడ్, హైదరాబాద్ వద్ద ప్రారంభమైంది.

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్

జెండా ఊపిన కవిత, విదేశీయుల డ్యాన్స్


ఈ గ్రీన్ రన్ హరిథాన్-5కే రన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. పీపుల్స్ ప్లాజా వద్ద మొదలైన రన్ జలవిహార్, పీవీఘాట్‌మీదుగా నెక్లస్ రోడ్డు వరకు సాగింది. రన్‌లో పాల్గొన్న ఔత్సాహికులతో రోడ్డంతా పచ్చతివాచి పరిచినట్టు కనిపించింది.

పాఠ్య ప్రణాళికల నిర్మాణంలో స్త్రీలకోసం ప్రత్యేకంగా తీసుకురావల్సిన మార్పులతో పాటు విద్యను అందించడంలో కింది స్థాయిలో ఎదురవుతున్న ప్రతిబందకాలను శ్రీమతి కవిత ప్రస్తావించారు. గ్రామీణ భారతంలో విద్యకు ఇవ్వవల్సిన ప్రాధాన్యత దక్కేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేయాలని చెప్పారు.

ఆరు విభాగాలుగా ఏర్పాటైన ఈ సదస్సులో ఎంపీ కవితతోపాటు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాక్రిష్ణన్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, సినీనటి ఖుష్బూ, నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్, ఇతర రాజకీయ, వ్యాపార, కళలు, సేవ తదితర రంగాలకు ప్రముఖులు దేశవ్యాప్తంగా మొత్తం 40మంది పాల్గొన్నారు.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha participated in think education 2015 conclave in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X