• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీ నెక్స్ట్ టార్గెట్ నిజామాబాద్.. రైతు కష్టాలు అందుకే? కొత్త సెంటిమెంట్‌కు తెరతీస్తున్న ఎంపీ!

|

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పేరును ఇందూరు గా మార్చడంపై హాట్ టాపిక్ నడుస్తుంది. ఉత్తర తెలంగాణలో ప్రముఖ పట్టణంగానే కాకుండా ఓ జిల్లా కేంద్రంగా నిజామాబాద్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజామాబాద్ నుండి టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవితపై బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ కవితను చిత్తుగా ఓడించేశారు.

ఎన్నికల సమయంలో నిజామాబాద్ రైతులు ఎన్నికల్లో పోటీ చేస్తూ తీసుకున్న నిర్ణయం , నిజామాబాద్ లో కవిత ఓటమి వెరసి ఇప్పుడు నిజామాబాద్ పేరు గుర్తు చేసుకుంటేనే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుటుంబానికి నిద్ర పట్టడం లేదు. ఇక ఎంపీగా గెలవడంతో దూకుడు మీద ఉన్న అరవింద్ నిజామాబాద్ జిల్లాలో తనదైన మంత్రాంగాన్ని నడుపుతున్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా నిజామాబాద్ పేరునే మార్చే దిశగా అరవింద్ పావులు కదుపుతున్నారు.

జగన్ ఓకే అన్నా ఆ పదవుల భర్తీపై మెలిక పెడుతున్నపెద్దలు..దేవుడు కరుణించినా పూజారి వరమివ్వట్లేదట!

నిజాం పేరు పెట్టడం వల్ల నిజామాబాద్ కు దరిద్రం పట్టుకుందన్న ఎంపీ అరవింద్

నిజాం పేరు పెట్టడం వల్ల నిజామాబాద్ కు దరిద్రం పట్టుకుందన్న ఎంపీ అరవింద్

నిజామాబాద్ పేరంటేనే చిరాకు పడుతున్న ఎంపీ అరవింద్ నిజాం పేరు పెట్టడం వల్ల నిజామాబాద్ కు దరిద్రం పట్టుకుందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అసలు పేరు ఇందూరు అని చెప్పారు. నిజాంలు ఆ పేరు మార్చి నిజామాబాద్ అని పెట్టారని పేర్కొన్నారు.ఎంపీ అరవింద్ నిజాం పేరుతో ఏం చేసినా దరిద్రమేనని అన్నారు. ఆ పేరు వల్లే నిజామాబాద్‌కు దరిద్రం పట్టుకుందని పేరు మార్చితేనే జిల్లా బాగుపడుంతుందని ఎంపీ అరవింద్ అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ బాగుపడాలంటే నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని పేర్కొన్నారు అరవింద్ .

 నిజాం పేరు పెట్టినవన్నీ నాశనం అయ్యాయన్న అరవింద్ ... నిజామాబాద్ పేరు మార్చాలని డిమాండ్

నిజాం పేరు పెట్టినవన్నీ నాశనం అయ్యాయన్న అరవింద్ ... నిజామాబాద్ పేరు మార్చాలని డిమాండ్

ఇందూరు అనే పేరును నిజాం మార్చాడని, హిందుస్థాన్ లోని హిందూను, ఇండియాలోని ఇండ్ ను కలిపితే ఇందూరు అని అది చాలా పవిత్రమైన పేరని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజాం పేరు పెట్టడం వల్ల నిజాం సాగర్ లో నీళ్లు లేవని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక నిజామాబాద్ రైతులకు ఎప్పుడూ కష్టాలు అని, ఆ పేరు ఉన్నంతకాలం రైతుల కష్టాలు తీరవని ఆయన అభిప్రాయపడ్డారు. మనకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నిజామాబాద్ పేరును ఇందూరు గా మార్చాల్సిందేనని ధర్మపురి అరవింద్ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ పేరును మార్చాలని అరవింద్ ఈ దిశగా చేస్తున్న యత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్న విషయం తెలియదు గానీ, ఆయన చర్య టీఆర్ఎస్ లో మాత్రం కాక పుట్టిస్తున్నదని చెప్పాలి.

 ప్రజల మనోభావాలు ఇందూరు పేరుతోనే ముడిపడి ఉన్నాయంటున్న అరవింద్

ప్రజల మనోభావాలు ఇందూరు పేరుతోనే ముడిపడి ఉన్నాయంటున్న అరవింద్

అయినా నిజామాబాద్ పేరును మార్చేస్తే టీఆర్ఎస్ కు ఏమిటి నష్టం అంటే నిజామాబాద్ పేరు మారిస్తే టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం ఆందోళన చేస్తుంది.మిత్ర పక్ష పార్టీ ఒప్పుకోదు కాబట్టి సీఎం కేసీఆర్ ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడతారనే విషయం అర్ధం అవుతుంది. ఇక నిజామాబాద్ కు ఇందూరు అనే పేరును అరవింద్ ప్రతిపాదిస్తున్నారు.ఈ క్రమంలోనే నిజామాబాద్ పేరును మార్చాలని స్వయంగా నిజామాబాద్ ప్రజలే కోరుతున్నారని కూడా ఆయన ఓ బాంబు పేల్చారు. ప్రజల మనోభావాలు ఇందూరు పేరుతోనే ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హిందూ ఇండియా పదాలకు దగ్గర గా ఉందన్న కారణంగా ఇందూరు అనే పేరు పెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలు కీలక నగరాల పేర్లను మార్యేందుకు చర్యలు తీసుకుంది. అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ గా మార్చేసింది. అలానే ఇప్పుడు నిజామాబాద్ పేరు ఇందూరు గా మార్చాలని నిజామాబాద్ ఎంపీ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడీ డిమాండ్ పై తెలంగాణలోని అధికార పార్టీ టిఆర్ఎస్ ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nizamabad MP Dharmapuri Arvind commented that Nizamabad was named "Nizamabad" by nizams. Nizams changed the name induru . MP Arvind said that whatever happened in the name of Nizam was worst . MP Arvind opined that Nizamabad has never develop with the name.Arvind said Nizamabad's name should be changed to Induru for the sake of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more