మెజార్టీ తగ్గినా, నేను ఓడిపోను, కిరణ్ సీఎం అవుతారనుకున్నామా: కోమటిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 90 మందికి సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అన్నారు.

చదవండి: రాహుల్ బిజీ, సొంత నేతలకు ఇష్టం లేదు: ఇబ్బందిపడుతున్న రేవంత్!

ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోను గెలుస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తనకు వచ్చే మెజార్టీలో తేడా ఉండవచ్చు కానీ ఓడిపోవడం మాత్రం ఏమాత్రం

వైయస్ రాజశేఖర రెడ్డి అలా గెలిచారు

వైయస్ రాజశేఖర రెడ్డి అలా గెలిచారు

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఐదు వేలతో ఓసారి, ఐదు లక్షల మెజార్టీతో మరోసారి గెలిచారని కోమటిరెడ్డి చెప్పారు. కానీ ఆయన ఓడిపోలేదని చెప్పారు. తాను కూడా ఓడిపోనని చెప్పారు.

గెలుపును ఎవరూ ఆపలేరు

గెలుపును ఎవరూ ఆపలేరు

టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 90 మంది సిట్టింగులకు తిరిగి టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని అభిప్రాయపడ్డారు. ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఓటమి ఖాయమని చెప్పారు.

పార్టీ పెట్టను

పార్టీ పెట్టను

అందుకే టీఆర్ఎస్ 40, యాభై మందిని మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే, తాను పార్టీ పెడతానని ప్రచారం జరుగుతోందని, అదంతా వట్టిదేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని తాను అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.

కిరణ్ సీఎం అవుతారని అనుకున్నారా?

కిరణ్ సీఎం అవుతారని అనుకున్నారా?

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. కంచర్ల భూపాల్ రెడ్డి గురించి స్పందించే స్థాయి తనది కాదన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డినే నలభై వేల ఓట్లతో ఓడించానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Congress leader Komatireddy Venkat Reddy on Wednesday said that no one can defeat him in his constituency.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి