దేవినేనీ! నేనో ఆటంబాంబు, దాన్ని బాంబులతో లేపేస్తాం!!: కేసీఆర్, మోడీ ఆ సాహసం చేస్తారా
మహబూబ్ నగర్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోజుకో కొత్త వివాదం అన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా, నీరు - ప్రాజెక్టుల గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం న నాడు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రోళ్ల పీడ విరగడ కాలేదు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నీటి పారుదల శాఖ దేవినేని ఉమామహేశ్వర రావు, రాయలసీమ హక్కుల నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి పైన ధ్వజమెత్తారు.
ఓ సయమంలో సుంకేశులను వెయ్యి బాంబులతో లేపేస్తామని హెచ్చరించారు. తెలంగాణకు ఇంకా ఆంధ్రోళ్ల పీడ విరగడ కాలేదని, ఇంకా శనిగలు పీక్కు తిన్నట్లు తింటున్నారన్నారు.
కోటిమంది చంద్రబాబులు వచ్చినా అడ్డుకోలేరు... ఖబడ్దార్ దేవినేని

ఈరోజు ఆంధ్రా సీఎం దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్రం అనుమతి లేదని చెబుతున్నారని, కృష్ణా నది ఏమైనా నీ జాగీరా అని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడుకు, సోమశిలకు, వెలిగొండకు అనుమతి ఉందా అని ఎదురు ప్రశ్నించారు.
ఎవరి అబ్బ సొత్తు అని వాటిని కట్టుకున్నావని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టవద్దని నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడిదని దేవినేనిపై మండిపడ్డారు. హరహర బ్రహ్మాదులు వచ్చినా, కోటి మంది చంద్రబాబులు వచ్చినా పాలమూరు ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు. నీ జేజమ్మలు దిగొచ్చినా అడ్డుకోలేరన్నారు.
మోడీ ఆ సాహసం చేస్తారా
మీ మాటలు విని ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును అడ్డుకునే సాహసం చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మేం భావించడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతుల్లేవని చెప్పడం విడ్డూరమన్నారు. మీ కళ్లముందే ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు.
మోడీ మీకే కాదు మాకూ ప్రధాని అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాని మోడీలాంటీ నీలాంటి కుక్కల మాట విని పాలమూరు ప్రజలకు నీరు ఇవ్వవద్దంటాడా అని అడిగారు.
మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. కృష్ణానది నీ అబ్బ సొత్తు కాదన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. మీ మూతి తన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ధర్మం, న్యాయం తమ వైపే ఉందన్నారు. త్వరలో కర్నాటకకు వెళ్లి మాట్లాడుతానని చెప్పారు.
ఈ కేసీఆర్ ఆటంబాబు మళ్లీ ఆర్డీఎస్ వద్దకు వస్తా... బైరెడ్డిపై నిప్పులు
ఆర్డీఎస్ అడ్డుకునేందుకు బైరెడ్డి ప్రయత్నించారని, దానికి తాను తీవ్రంగా స్పందించానని చెప్పారు. కేసీఆర్ ఆటంబాబు అని, మళ్లీ ఆర్డీఎస్ వద్దకు వస్తున్నానని సవాల్ చేశారు. ఆర్డీఎస్ అడ్డుకుంటే వెయ్యి బాంబులతో సుంకేశులను లేపేస్తామని హెచ్చరించారు. మైండిట్ చంద్రబాబు, మైండిట్ దేవినేని అన్నారు.
చంద్రబాబు ఏపీకి పారిపోవాల్సి వచ్చింది
ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించారో ఇప్పుడు అతనే ఏపీకి పారిపోవాల్సి వచ్చిందని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తాము ఎప్పుడూ న్యాయం కోసమే కొట్లాడుతుంటామని చెప్పారు. అందుకే తెలంగాణ వచ్చిందన్నారు. మేం మీలా ఎన్నికల ముందు పింఛన్లు లేదా డూప్లికేట్ పింఛన్లు ఇవ్వమని చెప్పారు.
కిరణ్ పోయాడు.. విద్యుత్ వచ్చింది
సమైక్యాంధ్ర సీఎం గతంలో మ్యాప్‌లు పట్టుకొని మరీ తెలంగాణ వస్తే విద్యుత్ కష్టాలు ఉంటాయని చెప్పారని, కానీ మేం ఆర్నెళ్లలో వాటిని తీర్చామని, తెలంగాణ వస్తే విద్యుత్ కష్టాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక మనకు చంద్రబాబు కూడా కరెంట్ ఇవ్వలేదన్నారు.
కురుముర్తి ప్రాజెక్టుగా నామకరణం
మీ కళ్లముందే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు కురుమూర్తి ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. నేను బతికున్నంత కాలం 24 గంటలు విద్యుత్ ఇస్తానని చెప్పారు. పాలమూరు ముంపు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మాకు వనరులు, వసతులు ఎక్కువ ఉన్నాయన్నారు. మా డబ్బులు మేం ఖర్చు చేసుకుంటున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications