ఎన్టీఆర్ జయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్‌రామ్ నివాళులు; ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!!
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, రాజకీయాలలో తనదైన ముద్రవేసిన వ్యక్తి, మహోన్నత శక్తి ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘటా వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన సమాధిపై పుష్పగుచ్చాలను ఉంచి అంజలి ఘటించారు. ఈరోజు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాతను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద చూసిన అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది . తెలుగు గుండె తల్లడిల్లుతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకి పో తాత.. సదా మీ ప్రేమకు బానిసను.. నందమూరి తారకరామారావు అంటూ తాత ఎన్టీఆర్ ఫోటోతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.
అన్న గారి జయంతి రోజున, NTR ఘాట్ కి వచ్చిన NTR @tarak9999 #JoharNTR 🙏 pic.twitter.com/Mb2oTqh068
— H A N U (@HanuNews) May 28, 2024
నేడు టీడీపీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు
అంతేకాదు నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్ టి రామారావు జయంతి సందర్భంగా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించడానికి టిడిపి నేతలు అభిమానులు ఏర్పాటు చేశారు. వేడుకలలో టిడిపి శ్రేణులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఇప్పటికే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రతీఏడూ మహానాడు.. ఈ ఏడాది ఎన్నికలతో వాయిదా
ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడును నిర్వహిస్తుంది. అయితే ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండడంతో టిడిపి అధిష్టానం మహానాడును ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించేందుకు వాయిదా వేసింది.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నేడు వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని, సేవా కార్యక్రమాలను చేయాలని టిడిపి పిలుపునిచ్చింది.
— Jr NTR (@tarak9999) May 28, 2024
ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు అభిమానుల నివాళులు
మండల, జిల్లా పార్టీ కార్యాలయాలలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టిడిపి అధిష్టానం సూచనలు చేసింది. తెలుగుజాతి కీర్తిని ఉన్నత శిఖరాలపై కి చేర్చిన స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టిన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు అందరూ జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications