చిక్కుల్లో పడ్డ పవన్ హీరోయిన్లు- బిగ్ బాస్ బ్యాక్‌గ్రౌండ్: 25 మంది సెలెబ్రిటీల లిస్ట్ ఇదే..!!

Nidhi Agarwal: అక్రమ బెట్టింగ్ యాప్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి మీదా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు మాత్రమే కాదు.. బిగ్ సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. వాళ్లపై ఎఫ్ఐఆర్‌ను ఫైల్ చేస్తోన్నారు.

పోలీసులు కొరడా..

మరోసారి హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారనే కారణంతో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వారితో పాటు మొత్తంగా 25 మంది సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై మియాపూర్ పోలీసులు కేసులు పెట్టారు.

Siri Hanmanthu

త్వరలో వారికి నోటీసులు..

బెట్టింగ్ యాప్‌లు, వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్నారనే కారణంతో ఫణీంద్ర శర్మ అనే 32 సంవత్సరాల ఓ బిజినెస్‌మెన్.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో వారికి నోటీసులు అందజేసే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2025 సీజన్ కూడా సమీపించిన నేపథ్యంలో..

కొంతకాలంగా హైదరాబాద్ సహా తెలంగాణలో అన్ని ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో బెట్టింగ్‌లపై నిఘా వేశారు పోలీసులు. ఐపీఎల్ 2025 సీజన్ కూడా సమీపించిన నేపథ్యంలో బెట్టింగ్‌లపై తమ నిఘా ముమ్మరం చేశారు. దాడులు తీవ్రతరం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్.. ఓ ఉద్యమంలా దీన్ని తెర మీదికి తీసుకొచ్చారు.

సజ్జనార్.. ఉద్యమం

#SayNoToBettingApps అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం సజ్జనార్ క్రియేట్ చేశారు. ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై దాన్ని వైరల్ చేశారు. జీవితాలను కబళించే ఆన్‌లైన్‌ గేమ్స్‌ జోలికి వెళ్లవద్దంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యూజర్లను ఆయన అప్రమత్తం చేస్తూనే వస్తోన్నారు.

Ananya Nagalla

రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ..

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తోన్న కొందరు యూట్యూబర్లపై కేసులు నమోదు అయ్యేలా చేశారు. ఈ క్రమంలోనే హర్షసాయి వంటి యూటూబర్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఇది మరింత విస్తరించింది. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌‌పై సైతం కేసులు నమోదుకు దారి తీసింది.

పవన్ హీరోయిన్లు..

రానా దగ్గుబాటి- జంగిల్ రమ్మి, ప్రకాష్ రాజ్- జంగిల్ రమ్మి, విజయ్ దేవరకొండ- ఏ23, మంచు లక్ష్మి- యోలో247 యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు. హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్ పైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రణీత- ఫెయిర్‌ ప్లే లైవ్, నిధి అగర్వాల్- జీత్ విన్‌ను ప్రమోట్ చేశారు. ప్రణీత- గతంలో అత్తారింటికి దారేదిలో నటించారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం హరిహర వీరమల్లులో నటిస్తోన్నారు.

అనన్య నాగళ్ల, సిరి హన్మంతు

అనన్య నాగళ్ల- వీఎల్ బుక్, సిరి హన్మంతు- తాజ్77, శ్రీముఖి- వీవీబీబీఓకేు, వర్షిణి సౌందరరాజన్- ధనిబుక్ 365, వాసంతి కృష్ణన్- మామా 247, శోభా షెట్టి- తెలుగు.365, అమృత చౌదరి- యెస్ 365, నయని పావని- వీవీబుక్, నేహా పఠాన్- వీఎల్ బుక్, పాండు- ఓకే విన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు.

Take a Poll

బిగ్ బాస్ కంటెస్టెంట్లు..

పద్మావతి- జై 365, ఇమ్రాన్ ఖాన్ జెట్ ఎక్స్ అండ్ పరి మ్యాచ్, విష్ణు ప్రియ- తాజ్ 777 బుక్, హర్ష సాయి- పరి మ్యాచ్, బయ్యా సన్నీ యాదవ్- ఒకటికి మించిన యాప్స్, శ్యామల- ఆంధ్రా 365, టేస్టీ తేజ- ఒకటికి మించిన యాప్స్, రీతూ చౌదరి- ఒకటికి మించిన యాప్స్, బండారు శేషయాని సుప్రీత- ఒకటికి మించిన యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదైంది. విష్ణు ప్రియ, టేస్టీ తేజ, సిరి హన్మంతు వంటి వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లు.

కేసులు ఇవే..

వాళ్లపై భారత్ న్యాయ సంహిత లోని సెక్షన్లు 318 (4), 112, ఆర్/డబ్ల్యూ 49, ఐటీ యాక్ట్‌లోని 3, 3 (ఏ), టీఎస్‌జీఏలోని 66-డీ కింద ఎఫ్ఐఆర్ నంబర్ 393/2025 రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+