ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌లో ఇద్దరు సినీ, టీవీ నటీమణులు: 2 గంటలకు రూ.1.20 వేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలను తెలంగాణ హైదరాబాద్, పరిసర ప్రాంతాల పోలీసులు ఎప్పటికప్పుడు రట్టు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, మరో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్ అయంది. ఘట్‌కేసర్ పరిసరాల్లో ఈ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు.

సెక్స్ రాకెట్‌లో సినీ, టీవీ నటీమణులు
గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రాంతంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించడంతో ఇద్దరు సినీ, టీవీ నటీమణులు, ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసుల తెలిపారు.

ప్లాట్‌ను అద్దెకు తీసుకొని, అమ్మాయిలకు రూ.1.20 లక్షలు
ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ టౌన్‌షిప్‌లో స్వామి అనే యువకుడు ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అల్వాల్‌కు చెందిన నరేష్ అనే యువకుడు ఆన్‌లైన్ ద్వారా ఇద్దరు అమ్మాయిలను రెండు గంటల సమయం కోసం రూ.1.20 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు.

ఇద్దరు అమ్మాయిలు వచ్చారు
శనివారం రాత్రి ఆరు గంటల సమయంలో ఇద్దరు అమ్మాయిలు టౌన్‌షిప్ వద్దకు వచ్చినట్లు మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్సై మహేశ్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

అదుపులోకి అమ్మాయిలు, ఇద్దరు వ్యక్తులు
అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారు సినీ, టీవీ నటీమణులుగా గుర్తించినట్లు ఎస్వోటీ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. నిర్వాహకుడు స్వామి, నరేష్‌ను అరెస్ట్ చేసి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.












Click it and Unblock the Notifications