తెరచిన మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం 60ఏళ్ల వృద్ధుడు మూతతెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. నారాయణగూడ డిటెక్టివ్ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సై జగన్నాథ్‌లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని సద్గురు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న హేమంత్ కుమార్ సహాయ్(60) శనివారం కుటుంబీకులతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి దసరా మిలాప్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఇంటికి ఒంటరిగానే వస్తున్నారు.
వీధి దీపాలు వెలగని కారణంగా చీకటి ఉండటంతో హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని నిరంతర్ కాంప్లెక్స్ దగ్గర డ్రైనేజీ మూత తెరిచి ఉన్న విషయం అతను గమనించలేదు. చీకట్లో సహాయ్‌కు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కనిపించక ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా, మ్యాన్‌హోల్‌లో పడగానే అక్కడికక్కడే ఎవరూ చనిపోరు. పడిన వెంటనే అరచి మరొకరి సహాయం కోరే అవకాశం ఉంది. పడినప్పుడు తలకు గాయమవ్వడం, షాక్‌కు గురయ్యారా.. లేక మురుగు నీరు తాగి, దుర్గంధాన్ని పీల్చి ఊపిరాడక మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిహెచ్ఎంసి కమిషనర్ హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ర్లను సస్పెండ్ చేశారు.

మృతికి కారణమైన మ్యాన్‌హోల్
నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం 60ఏళ్ల వృద్ధుడు మూతతెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు.

పోలీసుల విచారణ
నారాయణగూడ డిటెక్టివ్ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సై జగన్నాథ్‌లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతుడు
హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని సద్గురు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న హేమంత్ కుమార్ సహాయ్(60) శనివారం కుటుంబీకులతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి దసరా మిలాప్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

మృతుడు నివాసముండే అపార్ట్‌మెంట్
తిరిగి శనివారం రాత్రి ఇంటికి ఒంటరిగానే వస్తున్నారు. వీధి దీపాలు వెలగని కారణంగా చీకటి ఉండటంతో హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని నిరంతర్ కాంప్లెక్స్ దగ్గర డ్రైనేజీ మూత తెరిచి ఉన్న విషయం అతను గమనించలేదు.

ఘటన తర్వాత..
చీకట్లో సహాయ్‌కు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కనిపించక ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications