CM KCR: ఆధ్యాత్మిక ట్రెండ్ సెట్టర్ - ఐటీ టు టెంపుల్ సిటీ..!!
తాజా నిర్ణయాలతో ఆధ్మాత్మిక ట్రెండ్ సెట్టర్ గా కేసీఆర్ నిలుస్తున్నారని స్వామీజీలే అభినందిస్తున్నారు.
ఐటీ టు టెంపుల్ సిటీ. ఐటీ పరిశ్రమలో హైదరాబాద్ శరవేగంగా దూసుకెళ్తోంది. అభివృద్ధికి చిరునామాగా హైదరాబాద్ నిలుస్తోంది. ఇదే సమయంలో ఆధ్మాత్మికతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణలో ఘన చరిత్ర ఉన్న దేవాలయాలకు కొత్త శోభ తీసుకొస్తోంది. యాదాద్రి పునర్నిర్మాణం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక..కొండగట్టు విషయంలోనూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనలోని ప్రతి విషయంలో సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత.. దైవభక్తిని భాగస్వామ్యం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో ఆధ్మాత్మిక ట్రెండ్ సెట్టర్ గా కేసీఆర్ నిలుస్తున్నారని స్వామీజీలే చెబుతున్నారు.

తిరుమల తరహాలో యాదాద్రి కోసం..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రము దేవాలయాలు అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రముఖంగా యాదాద్రి రూపు రేఖలే మార్చేసారు. దేవాలయానికి ఉన్న చరిత్ర..విశిష్ఠత..ప్రాధాన్యతతో ఆ దేవాలయం ప్రతీ అడుగులోనూ ప్రత్యేకత ఉట్టిపడేలా కేసీఆర్ పర్యవేక్షణ చేసారు. పలుమార్లు స్వయంగా యాదాద్రి సందర్వించి ఆలయ పనులను సమీక్షించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయ ప్రాంగణాన్ని తిరుమల తరహాలో తీర్చి దిద్దాలని సంకల్పించారు. ఆలయ విమాన గోపుర నిర్మాణానికి స్వర్ణ తాపడం కోసం కేజీ 16 తులాల బంగారాన్ని సీఎం కేసీఆర్ స్వామి వారికి విరాళంగా అందించారు. వైటీడీఏకు 2,157 ఎకరాలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇందులోనే ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో హెలిప్యాడ్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు.వంద ఎకరాల్లో నృసింహ అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక శోభ వుండేలా అనుబంధ నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసారు.

కొండగట్టు కోసం రూ 600 కోట్లు
తెలంగాణలో మరో ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయం అభివృద్ధి పైన సమీక్ష చేసారు. నిధుల సమస్య లేదని తేల్చి చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని.. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలన్నారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కొండగట్టుకు అదనంగా ఇంకో రూ.500 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే బడ్జెట్‌లో కొండగట్టు కోసం రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన మరో రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.600 కోట్లను కొండగట్టు ఆలయ డెవలప్ మెంట్ కోసం వెచ్చించనున్నారు.

ఆధ్యాత్మికత.. దైవభక్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాజెక్టు తరువాత మరో దేవాలయం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు. యాదాద్రి నిర్మాణం.. ఇప్పుడు కొండగట్టు పైన నిర్ణయాలు అమలు అవుతున్నాయి. మిగిలిన ప్రముఖ దేవాలయాల పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా చదువుల తల్లి సరస్వతి దేవి కొలువై ఉన్న బాసరలోనూ ప్రత్యేకంగా అభివృద్ధి పనులు ప్రారంభించారు. కొండగట్టులో సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా యాగాలు నిర్వహించే కేసీఆర్..తెలంగాణలో ఇప్పుడు దేవాలయాలకు కొత్త శోభ తీసుకొస్తూ ఆధ్మాత్మిక ట్రెండ్ సెట్టర్ గా స్వామిజీల అభినందనలు అందుకుంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications