అనాధాశ్రమ నిర్వాహకుడి ఘాతుకం .. మైనర్ బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారం
తెలంగాణా రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళలు,బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ అనాధాశ్రమంలో జరిగిన దారుణం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది.

14 ఏళ్ల బాలికకు మత్తుమందిచ్చి ఆశ్రమ నిర్వాహకుడి ఘాతుకం
అమీన్ పూర్ అనాధాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు 14 ఏళ్ల బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశ్రమంలో ఉన్న 14 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేసిన ఆశ్రమ నిర్వాహకుడు,వార్డెన్ సహకారంతో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు బాలికను ఆశ్రమ నిర్వాహకుడి గదికి పంపి వార్డెన్ నిర్వాహకుడు సహకరించాడు.

ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపు .. అనారోగ్యంతో బాలిక
ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. దీంతో బాలిక భయపడి తనపై అత్యాచారం జరుగుతున్నా ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది .
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక బోయినపల్లిలోని తమ బంధువుల ఇంటికి వచ్చిన క్రమంలో ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది. బాలికపై అత్యాచారం జరిగినట్లుగా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.

బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించిన వైద్యులు .. కేసు నమోదు
దీంతో బంధువులు బాలికని ప్రశ్నించగా ఆశ్రమంలో తనపై జరిగిన దారుణాన్ని బాలిక బంధువులకు చెప్పింది. బాధితురాలి బంధువులు ఆశ్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనాధాశ్రమం ముసుగులో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఆశ్రమ నిర్వాహకుడితో పాటుగా, వార్డెన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Recommended Video

ఇబ్బడిముబ్బడిగా అనాధాశ్రమాలు .. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం
రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా ఎక్కడపడితే అక్కడ అనాధాశ్రమాలు పెరిగిపోతున్నాయి.అనాధ ఆశ్రమాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడితే ఇటువంటి దారుణాలు పెరిగిపోయే ప్రమాదముంది.ఈ ఘటన నేపథ్యంలోనైనా అనాధాశ్రమంలో ఏం జరుగుతుంది అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications