ఓయు విద్యార్థుల్ని ఇబ్బంది పెడ్తున్న కెసిఆర్: షబ్బీర్, 'ఆంధ్రా మత్తు దిగని ఎర్రబెల్లి'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ బుధవారం నాడు కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ గురించి ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశ్వవిద్యాలయాల్లో వీసీలు లేకపోవడం దారుణమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఆంధ్రామత్తు దిగలేదని... ఎర్రబెల్లిపై 'అసెంబ్లీ' వ్యాఖ్యలపై

OU students are facing problems in TRS government: Shabbir Ali

దివంగత అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించే సమయంలో తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడిన అంశంపై నమస్తే తెలంగాణ వెబ్‌సైట్ పత్రిక తనదైన శైలిలో స్పందించింది. ఎర్రబెల్లికి ఆంధ్రా మత్తు దిగలేదని పేర్కొంది.

శాసనసభలో ఎర్రబెల్లి ఆంధ్రా జపం చేశారని, కలాం మృతి పట్ల సీఎం కేసీఆర్ సభలో సంతాపం సందేశం ప్రవేశపెట్టాక,ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి అని కొనియాడుతూ, అలాంటి వ్యక్తులు పుడితే ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలని వ్యాఖ్యానించారని గుర్తు చేసింది.

ఎర్రబెల్లి వ్యాఖ్యలకు సభలో ఒక్కసారిగా అందరూ విస్తుపోయారని, కొందరు సభ్యులు నవ్వగా, మరికొందరు అభ్యంతరం తెలిపారని, దీంతో నాలుక కరుచుకున్న ఎర్రబెల్లి ఏపీ కాదు తెలంగాణ అంటూ కవరింగ్ ఇచ్చారని, సభలో సభ్యులు అభ్యంతరం తెలపడంతో ఎర్రబెల్లి నవ్వుతూ.. సారీ.. సారీ.. కలాం తెలంగాణలోనే పుట్టాలి.. తెలుగు ప్రజల్లోనే పుట్టాలన్నారని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+