ఓట్ల గల్లంతు వల్ల మా మెజారిటీ తగ్గింది..! తలసాని గెలుపు అసంతృప్తిని మిగిల్చిందన్న కేటీఆర్..!
హైదరాబాద్: ఓట్లు గల్లంతు కావడంతో తెలంగాణ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు అనుకున్న మెజారిటీ రాలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.తారాకరామారావు అన్నారు. ముఖ్యంగా సనత్ నగర్ నియొజక వర్గంలో తలసాని శ్రీనివాస యాదవ్ గెలుపు తనకు అసంత్రుప్తిని మిగిల్చిందని, ఓట్ల గల్లంతే ఇందుకు కారణమని కేటీఆర్ తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ఇలాంటి అవరోదాలను అదిగమిస్తామవని చెప్పుకొచ్చారు. ఒక్క ఖమ్మం మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజక వర్గాలు గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ జోష్యం చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం జలవిహార్ లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టీ.ఆర్ ప్రసంగించారు.
Recommended Video


కొంప ముంచిన ఓట్ల గల్లంతు..! పొరపాట్లు పునరావ్రుత్తం కాకుండా చూడాలన్న కేటీఆర్..!!
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ విశ్వాసం పొందే పరిస్థితి లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. ఈ రోజు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల వైపే దేశం చూస్తోందని ఆయన అన్నారు. రైతు బంధు పథకాన్ని మూడు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రైతు బంధు పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయన్నారు.

తెలంగాణ పథకాల వైపు దేశం చూపు..! రైతుబంధు ఆదర్శ పథకం అన్న కేటీఆర్..!
రెండో సారి టీఆర్ఎస్ సాధించిన విజయం దేశం లోనే ఓ రికార్డు అన్నారు. అసెంబ్లీ రద్దు ,కొన్ని గంటల వ్యవధి లోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి కెసిఆర్ సంచలనం సృష్టించారని, తెలంగాణ కోసం పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించిన అరుదైన నాయకుడు కెసిఆర్ అని పొగిడారు. ఆయన నాయకత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఓట్ల శాతం పెరిగినా మెజారిటీ తగ్గింది..! నిరాశ పరిచిన తలసాని విజయం అంటున్న కేటీఆర్..!
గతం లో కన్నా టీఆర్ఎస్ కు 14 శాతం ఓట్లు పెరిగాయని, అసెంబ్లీ లో 75 శాతం సీట్లు సాధించామని, ఇంత పెద్ద విజయం సాధించామని అహంకారం పనికి రాదన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేశారని. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 సీట్లుంటే మజ్లీస్ తో కలిసి 25 సీట్లు గెలిచామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల లాంటి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం అయ్యాయన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ 65 నుంచి 75 వేల మెజారిటీ తో గెలిచి ఉండి ఉండాల్సిందని అన్నారు. మెజారిటీ తగ్గినందుకు నాకు వ్యక్తిగతంగా బాధ గా ఉందని ఓట్ల గల్లంతు కూడా మెజారిటీ తగ్గడానికి కారణం అన్నారు కేటీఆర్.

పార్టీ కోసం పనిచేసిన వారిని ఆదుకుంటాం..! భరోసా ఇచ్చిన రామారావు..!
కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల లో ప్రాధాన్యత ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 16 పార్లమెంటు సీట్లు గెలిస్తే శాసించే స్థితి కి చేరుకుంటామన్నారు కేటీఆర్. కేసీఆర్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications