నోట్ల రద్దు: పెళ్లిళ్లపై కేంద్రం ఆరా!, లావాదేవీలు జరగని జన్ ధన్ ఖాతాల్లో నగదు జమపై..
ఇంట్లో పెళ్లి కోసం బ్యాంకు నుంచి రూ.2.5 లక్షలు విత్ డ్రా చేసుకుంటే ఆర్థిక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: ఇంట్లో పెళ్లి కోసం బ్యాంకు నుంచి రూ.2.5 లక్షలు విత్ డ్రా చేసుకుంటే ఆర్థిక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. నిజంగానే ఆ డబ్బు వివాహం కోసం తీసుకున్నారా లేక ఏదైనా నల్లధనం తెల్లధనంగా మార్చే ఉద్దేశ్యంతో తీసుకున్నారా అని తెలుసుకోనున్నారు.
ప్రధాని మోడీ నోట్ల రద్దు పైన నవంబర్ 8 ప్రకటన చేశారు. ఆ తర్వాత జరిగిన పెళ్లిళ్ల పైన ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. మరోవైపు, జన్‌ధన్ యోజన ఖాతాల్లో నిన్నటి వరకు రూ.21వేల కోట్లు జమయ్యాయని కేంద్రం వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువగా జన్‌ధన్ ఖాతాల్లో జమయ్యాయని, ఆ తర్వాత ఎక్కువ జమ అయిన రాష్ట్రాల్లో కర్ణాటక రెండోస్థానంలో నిలిచింది. జన్‌ధన్ ఖాతాల్లో జమ అవుతున్న వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమైతే తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది.
ఇప్పటి వరకు లావాదేవీలు జరగని ఖాతాల్లో నగదు జమపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతున్నారు. ఖాతాల విషయంలో ఎక్కడ అవకతవకలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతరుల డబ్బును తమ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిస్తే చర్యలు ఉంటాయన్నారు. కాగా, ఉత్తరాఖండ్,యూపీ తదితర రాష్ట్రాల్లో 35వేల జన్ ధన్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications