Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kinnera Mogulaiah: మండుటెండల్లో కూలీగా కిన్నెర మొగులయ్య; పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పెద్దకష్టమే

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్యకు పెద్ద కష్టమే వచ్చింది. మండుటెండల్లో రోజువారీ కూలీగా మారి దుర్భరమైన పరిస్థితులలో ఆయన పని చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు వచ్చిన పెద్ద కష్టంపైన, మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యతపైన చర్చ జరుగుతుంది.

కూలీగా మారిన కిన్నెర మొగులయ్య
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్ లో ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న నెలవారి గౌరవ వేతనం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Padma Sri awardee Kinnera Mogulaiah as daily wager heart breaking incident

గత ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం నిలిపివేత
తన కుమారుల్లో ఒకరు మూర్చతో బాధపడుతున్నారని, తన ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందని చెప్పిన ఆయన ప్రతినెల మందుల కోసం కనీసం 7వేల రూపాయలు కావాలని, ఇక సాధారణ వైద్య పరీక్షలు ఇతర ఖర్చులు కూడా ఉన్నాయని, ఇక వీటికోసం తాను కూలి పనులు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పదివేల రూపాయల గౌరవవేతనం ఇటీవల ఎందుకు నిలిపివేశారో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు కిన్నెర మొగులయ్య.

ఆర్ధిక ఇబ్బందులలో కిన్నెర మొగులయ్య
ఇంట్లో పూట గడవడం కోసం తాను పని కోసం చాలాచోట్ల ప్రయత్నించానని, అయినా తనకు గౌరవప్రదమైన పని ఎక్కడా దొరకలేదు అన్నారు. తన ప్రతిభను గుర్తించి కొంతమంది తనకు ఆర్థికంగా సహాయం చేసినా, తనకు ఉపాధి మాత్రం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తనకు కోటి రూపాయలు గ్రాంటుగా ఇచ్చిందని, అయితే ఆ డబ్బు తన పిల్లల పెళ్లి కోసం ఉపయోగించానని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఇస్తానన్న భూమి ఇవ్వలేదు
కళాకారుడిగా తనని గుర్తించిన గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 600చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అయితే కేటాయింపు ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. తుర్కయమంజాల్ లో కొంత భూమిని కొనుక్కొని, ఇంటి నిర్మాణం ప్రారంభించానని, ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మధ్యలోనే నిలిపివేశారన్నారు. తనకు ఇస్తామన్న భూమికోసం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మూడుసార్లు వెళ్లానని, కలెక్టర్ త్వరలోనే స్థలం కేటాయిస్తామని చెబుతున్నారు తప్ప ఏమి చేయడంలేదని మొగులయ్య పేర్కొన్నారు.

పద్మశ్రీ గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య
అరుదైన సంగీత వాయిద్యమైన 'కిన్నెర' వాద్య కళాకారుడిగా దర్శనం మొగులయ్యను 2022లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. అంతకుముందు మొగులయ్యకు నటుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+