మోడీజీ! పాక్‌ను ఒక దెబ్బతో రెండు ముక్కలు చేయండి!

పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన పాశవిక దాడులను ఖండిస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తోపాటు పలువురు మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్‌ కోసం వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, నగరవాసులు పాల్గొి మృతులకు సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలన్నారు. భారత్‌లోకి చొచ్చుకొచ్చి.. పాక్ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.

Pahalgam terror attack CM Revanth s hot comments on Modi government s full support

రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. భారత దేశం ఎంతో ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న సమయంలో పాక్ ఉగ్రవాదాలు దాడి చేశారన్నారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు.

ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు అని రేవంత్ చెప్పారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారన్నారు.

మరోసారి పాకిస్థాన్ ఓడించాలి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)ను భారత్‌లో కలపాలన్నారు. ప్రధాని మోడీ మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి. కోట్లాదిభారతీయులంతా మీకు మద్దతుగా ఉంటారు. ఒక్క దెబ్బతో పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపండి అని ప్రధాని మోడీని రేవంత్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+