ఫేస్‌బుక్‌లో పరిచయం, మహిళా టెక్కీకి స్వీట్ పాన్ ఇచ్చి: పలుమార్లు రేప్, అశ్లీల వీడియోలతో బెదిరింపు

Recommended Video

    కామాంధుడి ఉచ్చులో మహిళా టెక్కీ

    హైదరాబాద్: ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని, స్వీట్ పాన్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ దారుణ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. నిందితుడు పాన్ షాప్ యజమాని. వారి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి, పెళ్లి పేరుతో లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు. నిందితుడి పేరు ఉపేంద్ర. అతని బారిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ కూడా పడింది.

    ఆమెను కూడా ఇలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కానీ ఇప్పుడు వదిలేసేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆమె కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

    ఫేస్‌బుక్ రిక్వెస్ట్, స్వీట్‌పాన్‌లో మత్తు కలిపి రేప్, బ్లాక్ మెయిల్

    ఫేస్‌బుక్ రిక్వెస్ట్, స్వీట్‌పాన్‌లో మత్తు కలిపి రేప్, బ్లాక్ మెయిల్

    ఉపేంద్ర నగరంలో పలు ప్రాంతాల్లో పాన్ షాపులు నిర్వహిస్తున్నారు. అతను ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు రిక్వెస్టులు పెడతాడు. వారితో పరిచయం పెంచుకుంటాడు. వారిని ట్రాప్‌లోకి దించుతాడు. స్వీట్ పాన్‌లో మత్తు మందు కలిపి ఇస్తాడు. వారిపై దారుణానికి పాల్పడి, అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు తీస్తాడు. వాటిని చూపించి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడతాడని తెలుస్తోంది. ఇందులో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

     వీడియోలు తీసి బెదిరించాడు

    వీడియోలు తీసి బెదిరించాడు

    అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తనకు నిందితుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఫేస్‌బుక్ రిక్వెస్ట్ పెట్టాడని, పరిచయం పెరిగాక ఇష్టమని చెప్పాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపింది.

    అంతకుముందే అతనికి పెళ్లయింది

    అంతకుముందే అతనికి పెళ్లయింది

    ఆ తర్వాత తామిద్దరం గత ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. స్నేహితుల సమక్షంలో బంజారాహిల్స్‌లోని అతని స్నేహితుడి సంబంధించిన ఓ కార్యాలయంలో పెళ్లయిందని తెలిపింది. పెద్దవాళ్ళకు చెబుతామంటే తర్వాత చెప్తామని తనకు చెప్పాడని తెలిపింది. అయితే, అంతకుముందే అతనికి పెళ్లయినట్లు తనకు ఆ తర్వాత తెలిసిందని చెప్పింది.

    అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పెడతానన్నాడు

    అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పెడతానన్నాడు

    తామిద్దరం పెళ్లి చేసుకున్నప్పటికీ ఎవరి ఇంట్లో వాళ్లమే ఉన్నామని బాధితురాలు చెప్పింది. మూడు నాలుగు నెలలుగా అతని తీరుపై అనుమానం వచ్చిందని, అప్పుడు ప్రశ్నించానని చెప్పింది. దీంతో తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తనకు పంపించి, రచ్చ చేస్తే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

    ఏమీ అనకుండా జీవితంలో నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు

    ఏమీ అనకుండా జీవితంలో నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు

    బయటకు చెబితే అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని, దీంతో తాను అతనితో గొడవ పడ్డానని చెప్పింది. వారి ఇంటికి వెళ్లి నిలదీస్తే తన పైనే నిందలు వేశారని బాధపడింది. ఏమీ అనకుండా తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలని అతను భావించాడని చెప్పింది. లేదంటే ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని చెప్పింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించానని బాధపడింది. తనతో పాటు మరికొందరిని కూడా అతను మోసం చేసి ఉంటాడని చెప్పింది. ఈ సందర్భంగా మరో బాధితురాలు కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+