ఎంసెట్ లీకేజీలో కొత్త కోణాలు: పేరెంట్స్‌పై రంగంలోకి ఆదాయపన్ను

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లీకేజీ వెనుక బీహార్ మఠా హస్తం ఉన్నట్లుగా గతంలోనే అనుమానాలు వచ్చాయి. అది నిజమని నిర్ధారణ అయింది. బీహార్‌కు చెందిన సునీల్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ గుర్తించింది.

అతనిని పట్టుకునేందుకు రెండు బృందాలు వెళ్లాయి. అతను దళారులను పెట్టుకున్నాడు. వారి నుంచి కిందిస్థాయి దళారులకు ప్రశ్నాపత్రాలు అందించినట్లుగా తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పలు ప్రాంతాలకు బృందాలను పంపించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాని నిందితులు, దళారులలో రాజగోపాల్ రెడ్డికి మినహా ఎవరికీ నేర చరిత్ర లేదని సీఐడీ గుర్తించింది. ఈ కారణంగానే కేసు క్లిష్టంగా మారినట్లుగా కనిపిస్తోంది.

Also Read: సస్పెన్స్‌కు తెర: ఎంసెట్ 3 షెడ్యూల్ ఇదే, 2పై హైకోర్టులో విచారణ

Paper leak: Telangana govt to hold EAMCET-II exam again

ఇదిలా ఉండగా, ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలోకి తెలంగాణ ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ రంగంలోకి దిగుతోంది.

ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ సూత్రధారులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. రూ.10 లక్షలు అడ్వాన్సుగా కూడా తీసుకున్నారు.

Also Read: ఎంసెట్ 2 రద్దు, 200 మంది పేరెంట్స్‌కు శిక్ష తప్పదు: కేసీఆర్

ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు లీకేజీ సూత్రధారులకు ఇచ్చిన డబ్బు వైట్ మనీయా లేక బ్లాక్ మనీయా అనే కోణంలో విచారించనుందని తెలుస్తోంది. తాము ఇచ్చిన డబ్బులకు తల్లిదండ్రులు లెక్క చూపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The I-T department is closely following the Eamcet-2 leakage pro-be in view of lakhs of rupees changing hands between parents and agents.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి