వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్ టాపిక్: కేసీఆర్‌తో పవన్ కల్యాణ్ భేటీ మతలబు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్! కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్‍‌వా ?

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో భేటీ కావడం కాంగ్రెసు మింగుడు పడినట్లు లేదు. కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

కేసీఆర్ రైతులకు ఉచిత విద్యత్తును ఇవ్వడాన్ని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. దాన్ని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. పవన్ కల్యాణ్ కేసీఆర్‌తో భేటీ కావడం వెనక రాజకీయం ఏముందనేది చర్చనీయాంశంగానే ఉంది.

 పవన్ కల్యాణ్‌తో కేటీఆర్ గతంలో...

పవన్ కల్యాణ్‌తో కేటీఆర్ గతంలో...

కేసీఆర్ తనయుడు, మంత్రి కెటి రామారావు గతంలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కే తారకరామారావు చేస్తున్న కృషికి సినీ నటుడు పవన్‌కల్యాణ్ గతంలో ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్‌కు, తనకు ఉన్న బిజీ బిజీ షెడ్యూళ్ల నేపథ్యంలో సుదీర్ఘ వాయిదాల తర్వాత నాలుగు వారాల క్రితం మేం కలిసి భోజనం చేశామని, ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించుకున్నామని, రాజకీయాల గురించి కూడా మా అభిప్రాయాలను పంచుకున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా చేనేత కార్మికులకు ఏ విధంగా సహాయం చేయాలనే విషయంలో మేం సుదీర్ఘంగా చర్చించామని పవన్ కల్యాణ్ అన్నారు.

 కాటమరాయుడు సినిమా చూసిన కేటిఆర్

కాటమరాయుడు సినిమా చూసిన కేటిఆర్

అప్పట్లో మంత్రి కేటీఆర్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం కాటమరాయుడు సినిమా చూశారు. ఆ చిత్రంలో చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పించారని నటుడు పవన్‌కల్యాణ్‌ను, సినిమా దర్శకుడు డాలీని అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా పవన్‌కల్యాణ్ రీట్వీట్ చేశారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్‌తో భేటీకి ముందు కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. గవర్నర్‌కు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ గౌరవార్థం ఇచ్చిన విందు సందర్భంగా గవర్నర్ నరసింహన్ వవన్ కల్యాణ్‌తో ఏకాంతంగా మాట్లాడారు. అదే సమయంలో కేసీఆర్ పవన్ కల్యాణ్ మాట్లాడుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్‌తో భేటీకి ముందు కేసీఆర్ గవర్నర్‌ను కలవడం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

సయోధ్య కోసమే కలిశారా..

సయోధ్య కోసమే కలిశారా..

పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశానని, కేసీఆర్ పథకాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వచ్చానని చెప్పినపప్పటికీ భేటీలో రాజకీయ కోణం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆ రాజకీయ కోణం ఏమిటనేది అర్థం కావడం లేదు. అయితే, బిజెపికి, పవన్ కల్యాణ్‌కు మధ్య రాజీ ప్రయత్నాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

English summary
Buzz is that political equations may change with the meeting of Jana Sena chief Pawan Kalyan's meeting with Telangana CM K chandrasekhar Rao (KCR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X