మాట నిలబెట్టుకున్న కెసిఆర్: నటి పావలా శ్యామలకు అండగా టీ సర్కార్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరోమారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అనారోగ్యానికి గురై, సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పావలా శ్యామలను ఆదుకుంటామని గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రతి నెలా 10 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని గతంలో సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ఆ బాధ్యతలను అప్పగించారు. గురువారం హరికృష్ణ మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ పావలా శ్యామలా బ్యాంకు ఖాతాలో వేశారు.

ఈ సందర్భంగా పావలా శ్యామలా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని, తనలాంటి ఎంతోమంది కళాకారులకు ప్రభుత్వం దారి చూపుతున్నదని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకుంటానని కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన పట్ల తెలంగాణ సర్కార్ చూపిన చొరవను మరువలేనని, తనలాంటి ఎంతో మంది కళాకారులకు ప్రభుత్వం దారి చూపుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications