'తప్పు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అయినా ప్రజలు ప్రశ్నిస్తారు'
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని వ్యాఖ్యానించారు.
ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా నియమితులైన డాక్టర్ ఆయాచితం శ్రీధర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది.

తొలుత అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోని కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. ప్రజలకు దూరమైతే పదవులు కోల్పోతారని చెప్పారు. తప్పు చేస్తే సీఎంను సైతం అడిగే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications