చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు.. నాంపల్లి గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్న బత్తినిసోదరులు
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా, ఢిల్లీ, హర్యానా, చత్తీస్గడ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రస్తుతం చేప ప్రసాదం కోసం వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ప్రారంభ కార్యక్రమంలో చేప ప్రసాదం స్వీకరించారు.

బత్తిన సోదరుల చేప ప్రసాదంతో ఆస్తమా తగ్గున్తుందని విశ్వాసం
మృగశిర కార్తే మొదటి రోజు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణే చేసే చేప ప్రాసదం తీసుకుంటే, ఆరోగ్యం బావుటుందనీ, ముఖ్యంగా ఆస్తమా వ్యాధి పీడితులు భావిస్తారు. కాగా చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకుంటూ ఉండటంతో స్థానిక అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్స్ లో బారికేడ్స్, షామియానాలు ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.
చేప ప్రసాదం పంపిణీతో ట్రాఫిక్ మళ్లింపు
కాగా, ఈ రోజు, రేపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వెళ్ళే వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల నియంత్రించారు, కొన్ని చోట్ల దారి మళ్ళించారు. క్యూలైన్లో ఉన్నవారికి చేప ప్రసాదం దొరికేందుకు నాలుగు గంటల సమయం పడుతుంది. జూన్ 9 ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Distribution of popular 'Fish Prasadam' by the Bathini family, believed to be a cure for #asthma, began at the Exhibition Grounds, #Nampally in #Hyderabad today. About 4 to 5 lakh people from different states are expected to attend the programme.#FishMedicine #FishPrasadam pic.twitter.com/p7jm4wXW1T
— Surya Reddy (@jsuryareddy) June 8, 2024
ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సమయంలో రెండు రోజులపాటు బత్తిని సోదరులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, ఈ చేప మందు కోసం రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తుంటారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్ టి సి చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.












Click it and Unblock the Notifications