చికెన్, కోడి గుడ్లు కోసం ఎగబడ్డ జనం..ఎందుకో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో కోళ్లు చనిపోతున్నాయి. దీనికి కారణం బర్డ్ ఫ్లూ వైరస్. ఈ వైరస్ పక్షుల నుండి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు దూరంగా ఉండాలి. చనిపోయిన పక్షులను తాకకూడదు. పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తినాలి.బర్డ్ ఫ్లూ సోకిన వారిలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. బ్లడ్ ఫ్లూ నేపథ్యం చికెన్ , కోడి గుడ్లు అంటేనే భయపడిపోతున్న పరిస్థితి. బ్లడ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో, మటన్, చేపల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బర్డ్ ఫ్లూ గురించి ప్రభుత్వాలు ఇంత ప్రభుత్వాలు ఇంత ప్రచారం చేస్తోన్న చికెన్, కోడి గుడ్లు ఉచితం అనగానే ప్రజలు ఎగబడి తీసుకున్నారు.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. వెంకబ్ సంస్థ ఉచిత చికెన్ మేళా నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున చికెన్, ఎగ్స్ తినడానికి ఇష్టపడ్డారు. చికెన్ మేళాలో 200 కిలోల చికెన్, 2వేల ఎగ్స్‌ను వెంకబ్ సంస్థ వారు ప్రజలకు ఉచితంగా అందించారు.

ఉచిత మేళా మొదలుపెట్టిన కొద్ది నిమిషాల్లోనే చికెన్ ,కోడి గుడ్లు ఖాళీ అయ్యాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చికెన్, ఎగ్స్ తినడానికి ఇష్టపడ్డారు.ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా హాయిగా చికెన్ తిన్నారు. చికెన్, కోడి గుడ్ల తినేందుకు జనాలు ఆసక్తిగా వచ్చి ఎగబడ్డారు. వెంకబ్ సంస్థ వారు ప్రజల్లో ఉన్న అపోహాలు అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఈ ఉచిత చికెన్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications