నాకు సంబంధంలేదు: రోహిత్ సూసైడ్‌పై దత్తాత్రేయ, ఢిల్లీకి సెగ.. స్మృతి ఆఫీస్ వద్ద టెన్షన్
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడు తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ రాసిన లేఖ వల్లే ఈ దారుణం జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కూడా రోహిత్ లేఖలో పేర్కొన్నారు. అయితే, దత్తాత్రేయ లేఖ వల్లే ఇది జరిగిందని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ స్పందించారు.
రోహిత్ ఆత్మహత్య: దత్తాత్రేయ సహా 4గురిపై కేసు, బృందాన్ని పంపిన స్మృతివిశ్వవిద్యాలయంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందినందునే తాను లేఖ రాశానని చెప్పారు. ఏబీవీపీ కార్యకర్తలను దారుణంగా కొట్టినందునే తాను కేంద్ర మానవ మంత్రిత్వ శాఖకు లేఖ పంపించానన్నారు.

ఆ పైన ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. దీనిపై తనకుగానీ, తన పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. తనపై పెట్టిన కేసుల గురించి ఏమీ వ్యాఖ్యానించనని చెప్పారు.
రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ
రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మానవ వనరుల శాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ సంఘాన్ని నియమించారు. ఓఎస్‌డీ షకీలా శంషు, డిప్యూటీ సెక్రటరీ సూరత్‌సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక అందించనుంది. ఈ సాయంత్రం కమిటీ హెచ్‌సీయూకు చేరుకోనుంది. మరోవైపు, ఢిల్లీలోని స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట కొన్ని విద్యార్థు సంఘాలు ఆందోళన నిర్వహించాయి.
తద్వారా రోహిత్ ఆత్మహత్య సంఘటన సెగ ఢిల్లీని తాకింది. స్మతి ఇరానీ కార్యాలయం వద్ద విద్యార్థులు బారీకేడ్లు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మరోవైపు, హెచ్‌సియు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వర్శిటీ వద్ద వాటర్ కెనన్లు, బాష్పవాయుగోళాలను పోలీసులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, రోహిత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు విద్యార్థులు బయలుదేరారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications